కేంద్రీయ సైనిక బోర్డు, న్యూ ఢిల్లీ వారి ఉత్తర్వుల మేరకు 2021-2022 విద్యా సంవత్సరమునకు గాను విద్యా రాయితీలు, ఉపకార వేతనముల కొరకు 1వ తరగతి నుంచి ఇంటర్ మరియు under graduate కోర్సులకు సంబంధించి అర్హత కలిగిన మాజీ సైనికుల పిల్లలు ఆన్ లైన్ ద్వారా 07.01.2022 వరకు దరఖాస్తులు చేసుకొనుటకు అవకాశం కల్పించారు.
చిత్తూరు జిల్లాలోని ఆర్మీ, నేవీ మరియు ఎయిర్ ఫోర్సు నందు పనిచేసి రిటైర్ అయిన మాజీ సైనికులు మరియు మాజీ సైనిక వితంతువులు ఈ అవకాశమును ఉపయోగిoచుకోవచ్చు.
ఈ మేరకు చిత్తూరు జిల్లా సైనిక సంక్షేమ అధికారి ఆర్. విజయ శంకర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
మాజీ సైనికుల పిల్లలు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకొనుటకు కేంద్రీయ సైనిక బోర్డు వారి వెబ్ సైట్ www.ksb.gov.in.
ఇతర వివరములకు జిల్లా సైనిక సంక్షేమ కార్యాలయము, చిత్తూరు ఫోన్ నం.08572 228682 నందు సంప్రదించవలసినదిగా వారు తెలిపారు.
Discussion about this post