నిశ్చలంగా ఉన్న కొలను ఏ అలజడులు లేకుండా నిశ్శబ్దంగా, నిర్మలంగా, ప్రశాంతంగా ఉంటుంది. ఆ సమయంలో ఆకాశం యొక్క ప్రతిబింబం కొలనులో మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అలా కాకుండా అందులోకి ఒక రాయి విసిరామనుకోండి. అప్పుడు అలలు అనే అలజడులు ఏర్పడి ముందున్న నిశ్శబ్దం, నిర్మలత్వం, ప్రశాంతతకి విఘాతం కలగడమే కాకుండా ఆకాశం యొక్క ప్రతిబింబం చెదిరిపోతుంది.
అలాగే.. ఎలాంటీ అరమరికలులేని మనసు ప్రశాంతంగా ఉంటుంది. అప్పుడు సత్సంకల్పాలు కలుగుతాయి. అలా కాకుండా ఆ సమయంలో చెడు ఆలోచనలు మనసులోకి చొరబడ్డాయనుకోండి. అప్పుడు మనసు కలతచెంది దుస్సంకల్పాలవైపు మనసు మరలుతుంది.
మరి అలాంటి చెడు ఆలోచనలు మనలోకి చొరబడినప్పుడు కాస్త సంయమనం పాటిస్తే ఆ ఆలోచనల నుంచి బయటపడి మనసును సన్మార్గం వైపు మరల్చవచ్చు.
ఎలాగంటే.. ఆకాశం ఎప్పుడూ నిర్మలంగా ఉంటుంది. దట్టమైన మేఘాలు ఏర్పడినప్పుడు ఆకాశాన్ని కమ్మేసినట్లు మనకు గోచరిస్తుంది. నిజానికి ఆకాశాన్ని మేఘాలు స్పృశించలేవు. మేఘాలవల్ల ఆకాశానికి వచ్చిన నష్టమేమీ ఉండదు. అది ఎల్లప్పుడూ నిర్మలంగానే ఉంటుంది. కానీ, మేఘాలు మేం ఆకాశాన్నే చుట్టుముట్టేశాం అనే భ్రమలో ఉంటాయి.
అలాగే.. వర్షం పడినప్పుడు తామరాకుపై నీటి బిందువులు పడతాయి. అప్పుడు తామరాకును తడిపి ముద్ద చేసేశామని అ వర్షపు బిందువులు తెగ సంబరపడిపోతుంటాయి. కానీ, తామరాకు మాత్రం ఆ బిందువులను తనలో లయింపచేసుకోకుండా ఆ బిందువులను కిందకు జారవిడిచేస్తుంది. నీటి బిందువులేమో తమ ఆకృతిని చూసుకుని తామరాకే తమకు సింహాసనం అయిందని భావించి మురిసిపోతూ భ్రమలో ఉంటాయి.
ఇదే ఫార్ములాని జీవితానికి అన్వయించుకుంటే…
మనిషి అన్నాక ఆలోచనలు రాకుండా ఉండవు. అవి మంచివి కావచ్చు. చెడ్డవి కావచ్చు. మంచివైతే మనిషికొచ్చిన ఇంబందులేమీ ఉండవు. అవే చెడువైతే మన జీవితాన్నే అతలాకుతలం చేయవచ్చు.
also read : జగన్.. ప్రభువు ప్రార్థన మిస్ కాకూడదనేనా? లేదా..
అలాంటి సమయంలోనే మనం విజ్జత పాటించాలి. అప్పుడు ఆకాశం, తామరాకు తత్త్వాలను అవలంబించినట్లయితే ఏ కష్టాలు మనల్ని స్పృశించలేవు.
‘కష్ట,సుఖాల సమ్మేళనమే జీవితం. అందులోకి కష్ట, సుఖాలు వస్తూంటాయి, పోతుంటాయి. ఏదీ శాశ్వతంగా మన దగ్గర ఉండవు’ అనే విషయాన్ని జ్ఞప్తిలో ఉంచుకోవడమే ఆకాశ, తామరాకు తత్త్వాల ప్రయోజనం.
ఇవి కూడా చదవండి :
అరెస్టు నుంచి రక్షణ కవచం.. సిఆర్‌పిసి 41 (ఎ)
టీటీడీ బోర్డు భ్రష్టు పట్టిపోయిన చరిత్ర – పార్ట్ 1
టీటీడీ బోర్డు భ్రష్టు పట్టిపోయిన చరిత్ర – పార్ట్ 2
ఉదాహరణకు: తామర మొక్క కింద చుట్టూ బురద ఉంటుంది. కానీ, అది బురదను అసహ్యించుకోకుండా ఆ బురదనే ఆసరాగా చేసుకుని అందమైన పుష్పానికి జన్మనిస్తుంది. అంటే ఇక్కడ తామర మొక్క తన నిష్కల్మషాన్ని నిరూపించుకుంది.
అలాగే.. మన చుట్టూ ఎంతమంది చెడ్డవారు ఉన్నా, మనం వాళ్ళల్లోని మంచినే గ్రహించి, ఆకాశం, తామర మొక్క వలే నిష్కల్మషంగా ఉండగలిగితే మన జీవితం కూడా ఆకాశంవలే నిర్మలంగా, ప్రశాంతంగా, తామరపువ్వు వలే అందంగా ఉంటుంది.
అప్పుడు ప్రత్యేకించి ఏ దేవుణ్ణీ పూజించే అవసరం ఉండదు. నిష్కల్మషమైన నీ హృదయపుష్పమే దేవునికి నిజమైన అలంకారం అవుతుంది.
ఆ నిష్కల్మషమైన మౌనమే నిజమైన ప్రార్థన అవుతుంది.
..దేవీప్రసాద్ ఒబ్బు
9866251159

EXCLUSIVE ARTICLES
సీనియర్ జర్నలిస్టు గోవిందరాజు చక్రధర్ వ్యాసాల ప్రత్యేకపేజీ కోసం క్లిక్ చేయండి
‘సుభాషితం’ సంస్కృతశ్లోకాలకు భావవివరణల వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు బీరక రవి ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు డాక్టర్ ఎస్ రాము ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
దేవీప్రసాద్ ఒబ్బు లోపలిమాట వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సంపాదకుడు సురేష్ పిళ్లె వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
.