ఘంటసాల వెంకటేశ్వరావు తన తొలి సినిమా ‘స్వర్గసీమ’లో ఆనాటి మధురగాయని భానుమతి సరసన తన కంఠాన్ని వినిపించారు. అప్పట్లో వేశ్యావ్యామోహం బాగానే ఉండేది. దాన్ని వ్యతిరేకిస్తూ, సమాజానికి చక్కటి సందేశాన్ని ఇవ్వడానికి అలనాటి అద్భుతమైన దర్శకులు బి.ఎన్.రెడ్డి స్వర్గ సీమ పేరుతో తెరకెక్కించిన ఈ చిత్రంలో హేమాహేమీలు నటించారు.
సీనియర్ నటులు చిత్తూరు నాగఃయ్య, భానుమతి ఇందులో ప్రధాన పాత్రల్లో కనిపిస్తారు. చక్కగా సంసారం చేసుకునే ఒక వ్యక్తి, ఒక నాట్యగత్తె వ్యామోహంలో పడి తన చక్కటి సంసారాన్ని వదులుకుని, నాట్యగత్తెతోడిదే లోకంగా జీవనాన్ని సాగిస్తుంటాడు.
అయితే సంసారం యొక్క మధురిమను గుర్తించిన సదరు నాట్యగత్తె, చివరికి తన వ్యామోహంలో పడి కొట్టుకుపోతున్న ఆ వ్యక్తికి సంసారం యొక్క గొప్పదనాన్ని, గృహమేకదా స్వర్గసీమ అంటూ విశదపరచి, చివరికి ఆ వ్యక్తి తన కుటుంబాన్ని చేరుకునేలా చేయడంతో కథ సుఖాంతం అవుతుంది. ఈ సినిమా ఆకాలంలో అశేష ప్రజాదరణ పొందింది.
ఎంతగా అంటే అప్పట్లో అంటే 1945 కాలంలో భారతదేశపు ఎల్లలుదాటి విదేశీ గడ్డపై కూడా ప్రదర్శింపబడింది. వియత్నాం ఫిలిం ఫెస్టివల్ లో పాల్గొన్న తొలి తెలుగు సినిమాగా ఈ సినిమా రికార్డును సృష్టించింది. అందులో ఘంటసాల తన తొలి పాటను పాడడం నిజంగా ఆయన జీవితంలో కూడా మరచిపోలేనిదిగా చెప్పుకోవచ్చు.
ఈ సినిమా నేటికీ మనకు చక్కటి సందేశాన్ని ఇస్తుంది. నేటితరం వారు సంసారం అంటే చులకన చేస్తూ, సహజీవనం అంటూ వింతపెడపోకడలు పోతున్న నేపధ్యంలో మరోసారి, ఇలాంటి సినిమాలను రీమేక్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది.
.. ఆరంబాకం అన్నపూర్ణ

ఘంటసాల పాడిన తొలి ప్లేబ్యాక్ పాటను ఈ వీడియోలో వినండి. గుర్తుంచుకోండి.. వింటూ ఉండగా.. ఈ పాట ఘంటసాల పాడారని అంటే.. నమ్మడం కష్టం.
https://youtu.be/t5M84Ff3_3Q
.