• About Us
  • Contact Us
  • Our Team
Sunday, July 26, 2026
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
No Result
View All Result

ఘంటసాల – 4 : అక్కినేనికి శృతి కుదరక, అదృష్టం వరించింది!

admin by admin
December 7, 2021
0
ఘంటసాల తొలిపాట: భానుమతి సరసన భయంభయంగా..

Warning: Undefined array key "pt-cv-view-type" in /home/adarsini/public_html/wp-content/plugins/content-views-query-and-display-post-page/includes/block_view.php on line 112

మధుర గాయకుడు ఘంటసాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువేనేమో. సినీ ప్రపంచంలో తెలుగు శ్రోతలకు తన గానామృతాన్ని వెదజల్లడానికి ఘంటసాల రావడం అనేది తెలుగు ప్రేక్షకులు చేసుకున్న పూర్వజన్మ సుకృతమే.  ఘంటసాల తెలుగు సినీ రంగానికి లభించిన అదృష్టం. అప్పటి వరకూ తెలుగు సినీరంగంలో సాగిన నేపధ్యగానం ఒక ఎత్తయితే.. ఘంటసాల తర్వాత సాగిన గానం మరొక ఎత్తుగా చెప్పవచ్చు.

మనలో చాలామందికి తెలియని సంగతి ఒకటుంది. ఘంటసాల స్వాతంత్ర్య సమరయోధుడు. 1942లో ఆయన క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని రెండేళ్లపాటు ఆలీపూర్ జైల్లో శిక్షను అనుభవించాడు. తర్వాత తన మేనకోడలు సావిత్రిని అర్ధాంగిగా స్వీకరించాడు.

మరో విశేషం ఏమంటే ఎవరైనా తమ పెళ్లికి గాయకుల పాటకచ్చేరీ నిర్వహించేవారు. కానీ ఘంటసాల మాత్రం తన పెళ్లికి తానే కచ్చేరీ నిర్వహించి ఆహూతులను తన అద్భుత గానంతో అలరించాడు.

కొన్నాళ్లకు సముద్రాల రాఘవాచార్యులు ఘంటసాలను కలిసి, ఆయన గాన మాధుర్యాన్ని గుర్తించి మద్రాసుకు వచ్చి తనను కలుసుకోమని సూచించాడు. ఎలాగోలా మద్రాసు చేరుకున్న ఘంటసాలకు వెళ్లగానే ఇలా సినీ అవకాశాలు పరుగెత్తుకు రాలేదు. కొన్నాళ్లపాటు పానగల్ పార్క్ లో తన మకాం వేసి, అక్కడినుండే సినీ అవకాశాలకోసం వెదుక్కోసాగారు. తర్వాత తొలిసారిగా స్వర్గసీమతో తన గళసీమనుండి జాలువారిన పాటను శ్రోతలకు వినిపింపజేశాడు.

1945లో స్వర్గసీమతో సినీరంగంలోకి అడుగుపెట్టిన తర్వాత మూడేళ్లపాటు చిన్న చిన్నఅవకాశాలు మాత్రమే వచ్చాయి. అయినా ఘంటసాల మొక్కవోని ధైర్యంతో మద్రాసులో అవకాశాలకోసం ఎదురుచూశాడు. చివరికి నాగేశ్వరరావు హీరోగా నటించిన బాలరాజు చిత్రంలో ఏ.ఎన్.ఆర్ కు నేపథ్యగానం పాడే అవకాశం లభించింది.

ఇదికూడా అంత తేలిగ్గా రాలేదు. అప్పటికి నాగేశ్వరరావు తన పాటలను తానే పాడుకొనేవారు. అయితే ఈ చిత్రంలో ఎస్.వరలక్ష్మీ సరసన నాగేశ్వరరావు తను పాటపాడగా ఇద్దరిదీ ఒకే శృతిలో ఉండడంతో తనకు నేపథ్యగానం పాడే అవకాశం ఘంటసాలకు ఇప్పించారు. మరో విశేషం ఏమంటే.. నాగేశ్వరరావు, ఘంటసాల అప్పటికే మద్రాసులో రూమ్మేట్స్. దీంతో అటు తన స్నేహితుడికి సహాయం చేసినట్టు ఉంటుంది, ఇటు తనకు కూడా చక్కటి నేపథ్యగానం ఉంటుంది అనే ఉద్దేశ్యంతో నాగేశ్వరరావు- బాలరాజు సినిమా దర్శక నిర్మాత ఘంటసాల బలరామయ్య దగ్గరికి వెళ్లి తనకు నేపథ్యగానం పాడే అవకాశం ఘంటసాలకు ఇప్పించాల్సిందిగా సూచించారు. అలా ఘంటసాలకు తొలిసారిగా నాగేశ్వరరావుకు నేపథ్యగానం పాడే అవకాశం లభించింది.

మరో ముఖ్యవిశేషం ఏమంటే ఈ చిత్రం తెలుగులో రజతోత్సవం జరుపుకున్న మొదటి చిత్రం కావడం. ప్రొద్దుటూరు, మదనపల్లి వంటి చిన్న కేంద్రాల్లో కూడా ఈ చిత్రం రజతోత్సవం జరుపుకుంది. ఇలా ఘంటసాల- అప్పటికే ఒక మంచి హీరోగా గుర్తింపు పొందిన నాగేశ్వరరావుకు నేపథ్యగానం అందించి, అందరినీ అలరించారు. ఆ పాట మీకోసం..

Also Read these articles :

ఘంటసాల సొంత కథ- 4: సినీ ప్రస్థానం ఇలా..

ఘంటసాల సొంత కథ- 3: నటుడిగా ప్రారంభించి..

ఘంటసాల సొంత కథ- 2: భిక్ష చేసుకుంటూ విద్యార్జన

  • 1
  • 2
  • 3
  • ›
Loading...

చెలియా కనరావా.. పాట

చెలియా కనరావా
నిరాశ బూని పోయితివా
ఓ చెలియా కనరావా
నిరాశ బూని పోయితివా
ఓ చెలియా కనరావా

ఓ చెలియా కలయేనా మన గాథ
చెలియా కనరావా
ఏ కోనలలోన నిను గాన
ఏ దారి బోయితివో నా దారి ఏమో
చెలియా కనరావా

తనువు, మనసు నీదే
నా తనవు మనసు నీదే
హితమును మనదే
నీదే నీదేనని బాస చేసినావే జవరాలా
రాని కోపాలు నాపైన నీకేల

చెలియా కనరావా నిరాశ బూని పోయితివా
కలయా మనగాథ
చెలియా కలయా మనగాథ

 

ఈ పాటలో ఘంటసాల ఆత్మ మనకు కనిపిస్తుంది. తాను అప్పటికే సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టి నాలుగేళ్లు అవుతున్నా.. ఎలాంటి పెద్ద అవకాశాలు కనుచూపుమేరలో కనిపించకున్నా.. వాటికోసం ఘంటసాల వెదుకుతున్నట్టుగా ఉంటుంది. మనసు కదిలించే పాటతో అందరి దృష్టీ ఒక్కసారిగా ఆయనపై పడింది. ఇంత చక్కటి నేపథ్యగానం అందించిన వారెవరా అని అందరూ ఒకసారి చూసారు. తర్వాత ఆయన  వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. తర్వాత అవకాశాలు రావడంతో కాస్త ఉరవడి పెరిగింది. చివరికి ఆయన తెలుగు సినీరంగంలో తనదైన ముద్ర వేసేంతగా శిఖరాయమానంగా ఎదిగారు.

.. ఆరంబాకం అన్నపూర్ణ

చెలియా కనరావా పాటను దిగువ చూడండి :

https://youtu.be/fDmFdJ6ghu0

Tags: ghantasalaghantasala 100ghantasala centenaryghantasala venkateswara raoghantsala 1922 to 2022old songstelugu film songstelugu old songsఘంటసాలఘంటసాల వెంకటేశ్వరరావుఘంటసాల శతజయంతిఘంటసాల శతజయంత్యుత్సవాలు
Subscribe
Login
Notify of
guest
Optional

guest

0 Comments
Oldest
Newest Most Voted

Top Read Stories

28 జూన్ 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

5 జులై 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

28.6.26 ‘కథానిధి’ సమీక్ష: వర్తమాన సామాజిక వాస్తవికత

19.7.26 కథానిధి సమీక్ష: సమకాలీన కల్లోల జీవిత చిత్రణ

12 జులై 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

5.7.26 ‘కథానిధి’ సమీక్ష: సామాజిక రుగ్మతలపై అక్షరాల తిరుగుబాటు

VIDEO

https://www.youtube.com/watch?v=4IsF6u52r8o&autoplay=1&mute=1
Adarsini

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

Navigate Site

  • About Us
  • Contact Us
  • Our Team

Follow Us

No Result
View All Result
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

error: adarsini.com Content is protected !!
wpDiscuz
0
0
Would love your thoughts, please comment.x
()
x
| Reply