తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరాలయంలో శుక్రవారం కృత్తిక నక్షత్రాన్ని పురస్కరించుకుని సాయంత్రం కృత్తికా దీపోత్సవం జరుగనుంది. కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో ఈ ఉత్సవాన్ని ఆలయంలో ఏకాంతంగా నిర్వహిస్తారు.
ఈ సందర్భంగా సాయంత్రం 5 నుండి 6.30 గంటల వరకు దీపారాధన, కృత్తికా దీపోత్సవం నిర్వహిస్తారు. ముందుగా గర్భాలయంలో, తరువాత ఆలయ శిఖరంపైన దీపారాధన చేస్తారు. రాత్రి 7.30 గంటలకు పుష్కరిణి వద్ద జ్వాలాతోరణం ఏర్పాటుచేస్తారు.
.
Discussion about this post