పేదలకు అండగా ఉంటానని శ్రీకాళహస్తి శాసనసభ్యులు బియ్యపు మధుసూదనరెడ్డి చెప్పారు. జగన్ జన్మదిన వేడుకల్లో భాగంగా సోమవారం శ్రీకాళహస్తి పట్టణంలో 200 మంది పేదలకు తోపుడు బండ్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జగన్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 17 సంవత్సరాల క్రితం రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా శ్రీకాళహస్తిలో జగన్మోహన్ రెడ్డిగారి పుట్టినరోజు వేడుకలు నిర్వహించామన్నారు.
నాటి నుంచి నేటి వరకు ప్రజలందరి ఆశీస్సులతో తాను చేతనైనంత సాయం నియోజకవర్గ ప్రజలకు అందిస్తున్నట్టు ఆయన చెప్పారు. జగన్ జన్మదిన వేడుక ఆంధ్ర రాష్ట్రం లో ఒక పండుగ లాంటిదన్నారు.
అందులో భాగంగానే శ్రీకాళహస్తిలో 200లకు పైగా తోపుడు బండ్లు పంపిణీ చేయడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రజల సుఖ, సంతోషాలు కోరుతూ జగనన్న నవరత్నాలను తీసుకువచ్చి పేదల కళ్ళల్లో ఆనందం నింపారన్నారు.
జగన్ కుటుంబం ఎల్లవేళలా సుఖ, సంతోషాలతో ఉండాలని జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరని, కలియుగదైవం వెంకటేశ్వరస్వామిని వేడుకుంటున్నాని ఆయన ఈ సందర్భంగా చెప్పారు.
మరో వందేళ్లు జగన్ ప్రభుత్వమే కొనసాగుతూ ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు పలువురు పాల్గొన్నారు.
.