సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ డి రాజా నగరి నియోజకవర్గం ఐనంబాకం సొంత ఊరిలో ఉన్న సీపీఐ జాతీయ కార్యదర్శి కె నారాయణని కలిసి ప్రేమ పూర్వకంగా పరామర్శించారు.
నారాయణ గారి కుడి కాలు కు రాయల చెరువు కట్ట పరిశీలన కోసం వెళ్ళి నప్పుడు కాలు బెణకడం తో గాయం అయిన విషయం విదితమే .
డి. రాజా గారు డిల్లీ నుండీ వచ్చి ఆప్యాయంగా పలకరించారు.
డి రాజాతో పాటు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ, సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, జిల్లా కార్యదర్శి రామానాయుడు, జిల్లా కార్యవర్గ సభ్యులు చిన్నం పెంచలయ్య , టి . జనార్దన్ , పి ఎల్ నరసింహులు , జె . విశ్వనాథ్ , కె . కుమార్ రెడ్డి , నగరి నియోజకవర్గం కార్యదర్శి కోదండం , విజయన్ తదితరులు ఉన్నారు.
.