ఓటిఎస్ పేరుతో పేద ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తారా అని నగరి నియోజకవర్గ తెదేపా ఇన్చార్జి గాలి భాను ప్రకాష్ ప్రశ్నించారు.
ఓటిఎస్ పేరుతో డబ్బులు వసూలు కు వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది కు టార్గెట్ లు ఇచ్చి కట్టకపోతే పెన్షన్ లు, రేషన్ కార్డులు తీసేస్తాం అంటూ పేద ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తే ప్రజలు తిరగబడతారని నగరి నియోజకవర్గ తెలుగుదేశం ఇన్చార్జి గాలి భాను ప్రకాష్ హెచ్చరించారు..
విజయపురం మండలం మాధవరం లో ప్రజా సమస్యల చర్చా వేదిక- గౌరవ సభ కార్యక్రమం లో పాల్గొన్నారు..
ఎప్పుడో ,ఎవరో ఇచ్చిన ఇండ్లకు మీ వసూళ్ళు పెత్తనం ఏందని ప్రభుత్వం ను ప్రశ్నించారు.. ఎవ్వరూ ఒక్క రూపాయి కట్టొద్దు, మేము వస్తాం ప్రతి ఒక్కరికీ ఉచితంగా రిజిస్ట్రేషన్ లు చేయించి పట్టాలిస్తాం అని పేర్కొన్నారు..
గతంలో పాలించిన ముఖ్యమంత్రులు పేదలకు ఇండ్లు కట్టించారు తప్ప, కట్టిన ఇండ్లకు బాకీల పేరుతో ఇబ్బందులు పెట్టడం ఈ వైసీపీ పాలనలో జరుగుతోంది..
చంద్రబాబు గారు కట్టించిన ఇండ్లు ఇచ్చే ధైర్యం లేదు ,కొత్తగా ఒక్క ఇల్లు కట్టించలేని దౌర్భాగ్యపు సిఎం అని విమర్శించారు..
చివరకు డ్వాక్రా మహిళలు రోజుకు రూపాయి చొప్పున కట్టుకున్న రు.2200 కోట్ల అభయ హస్తం భీమా డబ్బులను లాగేసుకుకోవడం ఈ వైసీపీ ప్రభుత్వ అసమర్థ పాలనకు నిదర్శనం..
పంచాయితీ ఖాతాలోని డబ్బులు సర్పంచ్ లకు తెలియకుండా వాడేసుకుని సర్పంచ్ లను ఉత్సవ విగ్రహాలుగా మార్చేసారు..గ్రామాలలో కనీస అవసరాలు పరిష్కారం చేయలేక సర్పంచ్ లు ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడిందని అన్నారు.
గతంలో ముద్దుకృష్ణమ నాయుడు, తెలుగుదేశం ప్రభుత్వం లో నిర్మించిన రోడ్లు తప్ప, ఈ ప్రభుత్వం లో నియోజకవర్గంలో ఎక్కడా ఒక్క రోడ్డు నిర్మించింది లేదు..చెప్పుకునే స్థాయిలో ఒక్క మంచి అభివృద్ధి కార్యక్రమం వుందా అని భానుప్రకాష్ ప్రశ్నించారు..
.