రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు న్యాయబద్ధంగా అమలు చేయవలసిన పి.ఆర్.సి.ని వేంటనే అమలు చేయాలని JAC నాయకులు కలికిరి పవన్ కుమార్ రెడ్డి , మురళి డిమాండ్ చేశారు.
మంగళవారం APJAC, APJAC అమరావతి సంయుక్త నాయకత్వం ఇచ్చిన పిలుపుమేరకు తడుకుపేట ఉన్నత పాఠశాలలో JAC నాయకులు నల్లబ్యాడ్జీలు ధరించి ప్లకార్డులతో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వారం రోజుల్లో సి.పి యస్.రద్దు చేస్తామని హామీ ఇచ్చిన వాగ్దానాన్ని ఇప్పటికైనా నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.
రోజురోజుకీ నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్న నేపథ్యంలో గతంతో ఎన్నడూ లేని విధంగా 7 కరువుభత్యాలు పెండింగ్ లో ఉంచడం శోచనీయమని పేర్కొన్నారు.
వెంటనే అన్నీ డి.ఏ.లను విడుదల చేయాలని కోరారు. ఉద్యోగుల భద్రత ప్రభుత్వ బాధ్యత అని గుర్తుచేశారు. ఇటువంటి నేపథ్యంలో పి.ఆర్.సి.కాలపరిమితి దాటి 40 నెలలైనా ఇప్పటికీ అమలుచేయకపోవడం దారుణమని వాపోయారు.
సాంకేతికత పేరుతో ఉపాధ్యాయులను బోధనకు దూరం చేస్తున్న “యాప్” లను రద్దుచేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల జీతాలనుండి ప్రతినెలా హెల్త్ కార్డుల కొరకు కోత విధిస్తున్నప్పటికీ హాస్పిటళ్ళలో వాటిని అనుమతించకపోవడం వల్ల ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.
రాష్ట్రంలో అనేక పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత అధికంగా ఉండడం వల్ల బోధన కుంటు పడుతోందని , వెంటనే ఉధ్యాయ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని సూచించారు.
APJAC, APJAC అమరావతి ప్రతిపాదించిన 71 సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఇదివరకే ప్రకటించిన మేరకు ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో JAC నాయకులు గంగామోహన్ , మోహన్ రాజు, శ్రీదేవి, రమేష్, ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు పద్మనాభరాజు, ఉపాద్యాయులు సిద్దయ్య, మురగేష్, రవి, మంగమ్మ, సుబ్రమణ్యం , మీరయ్య, రాము, కణ్ణమ్మ, నిర్మల, వెంకటేశులు, శివకుమార్, కేశవులు , మాధవి, ప్రభావతి, రమేష్, చిత్ర, విజయ తదితరులు పాల్గొన్నారు.
.