నగరి నియోజకవర్గంలో ఇటీవల కురిసిన, రాబోవు భారీ వర్షాలకు తీసుకోవలసిన ముందస్తు జాగ్రత్తలు గురించి అధికారులతో ఎమ్మెల్యే ఆర్కే రోజా మంగళవారం నాడు సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ కార్యక్రమం లో మాట్లాడుతూ చెరువుల ఆక్రమణలను గుర్తించి తొలగించడానికి చర్యలు తీసుకోవాలని, గ్రామీణ పారిశుద్ధ్య విభాగానికి సంబంధించి, వైరల్ జ్వరాలకు తగిన సామగ్రి అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. డ్రైనేజీలు క్లీన్ చేయాలని, స్ప్రేయర్స్ చేయాలని, ప్రతిచోటా ఆశా వర్కర్లు, ANM లను అందుబాటు లో వుండేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.
అదేవిధంగా ముఖ్యమంత్రి చెప్పిన విధంగా దెబ్బతిన్న ఇళ్ల గురించి నివేదికను సానుకూలంగా పరిశీలించాలని, అదేవిధంగా మూగజీవులు చనిపోయిన వాటిని గుర్తించి నష్టపరిహారం ఇప్పించాలని కోరారు.
క్రాప్ నష్టాన్ని గుర్తించి రైతులను ఆదుకోవడానికి చర్యలు తీసుకోవాలని.. వర్షపు నీళ్ళు, త్రాగు నీరు కలసిపోకుండా వ్యాధులు వ్యాపించకుండా చర్యలు తీసుకోవాలని రోజా అధికార్లకు చెప్పారు.
రహదారుల కోతలను గుర్తించి వెంటనే చర్యలు తీసుకోవాలని అన్నారు.
ముఖ్యంగా వైద్యాధికారులు సరిపడా మందులు ఉంచుకోవాలని, లేకపోయినా తనను సంప్రదిస్తే వెంటనే తన స్వంత నిధులతోనైనా ఇప్పించగలనని రోజా వారికి హామీ ఇచ్చారు.
ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని వారికి మౌలిక వసతులు కల్పించాలని కోరారు.
హెల్త్ అసిస్టెంట్లు, ఆశా వర్కర్లు అంటు వ్యాధులపై ఇంటింటికి సర్వే నిర్వహించి ప్రతి గ్రామంలో మెడికల్ క్యాంపు నిర్వహించాలన్నారు.
గ్రామపంచాయతీ లో సర్పంచులు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి,ఆలాగే నీటి ట్యాంకులను శుభ్ర పరిచి స్వచ్ఛమైన త్రాగునీరు ప్రజలకు అందించాలని చెప్పారు.
నిండిన చెరువులను ఇరిగేషన్ అధికారులు పర్యవేక్షణ చేయాలని, నది ప్రవాహ ప్రాంతాల్లో ఉన్నటువంటి అక్రమ ఇండ్లను గుర్తించి వారికి నోటీసులు ఇవ్వాలని రెవెన్యూ అధికారులకు ఆదేశించారు,
.