ఈరోజు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో గౌరవ ప్రతిపక్ష నాయకుడైన నారా చంద్రబాబు నాయుడు గురించి మంత్రి కోడెల నాని వాడిన పదాలు చాలా హేయ మైనవని, నగరి మున్సిపల్ తెలుగుదేశం పార్టీ తరఫున తీవ్రంగా ఖండించారు.
ఈ మేరకు తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు జి రమేష్ బాబు ప్రధాన కార్యదర్శి ఎన్ శ్రీనివాస ఒక ప్రకటన విడుదల చేశారు.
శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం ఒక మాజీ ముఖ్యమంత్రి కుటుంబ సభ్యురాలు గురించే శాసనసభలో ప్రస్తావించడం సరైన పద్ధతి కాదని వెంటనే కొడాలి నాని ని వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి క్షమాపణ చెప్పాలన్నారు.
ఇదే విధంగా కొనసాగితే తెలుగు తమ్ముళ్ళు తగిన గుణపాఠం చెబు.తారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు జి రమేష్ బాబు చిత్తూరు పార్లమెంటు కార్యదర్శి ఆర్ బాలాజీ, మాజీ కార్యదర్శి జ్యోతి నాయుడు, ప్రధాన కార్యదర్శి ఎం శ్రీనివాస్, నాయకులు యుగంధర్ , సలీం, శ్రీధర్, వెంకటేష్ , ఆర్ముగం, సైదులు, అలీ, ముత్తు, అన్సారి అన్నయ్య రమేష్, ఆకుల అశోక్ మాణిక్యం తదితరులు పాల్గొన్నారు
.