కన్నడ పవర్ స్టార్ట్ పునీత్ రాజ్ కుమార్ కుటుంబ సభ్యులను పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పరామర్శించారు.
బెంగుళూరులో పునీత్ రాజ్ కుమార్ సతీమణి అశ్వినిని మంత్రి పరామర్శించి తన సానుభూతి తెలియజేశారు.
పునీత్ అకాల మరణం చాలా బాధించింది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అని పేర్కొన్నారు.
చిన్న వయస్సు లో అనేక మంచి కార్యక్రమాలు చేసి ఎంతో మందిని ఆదుకున్న గొప్ప మానవతావాది పునీత్ అని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు.
.