ఒకే దర్శకుడు.. ఇద్దరు హీరోయిన్లు. ఇద్దరినీ రెగ్యులర్ఱ కమర్షియల్ కథానాయికలు లాగా కాకుండా.. భిన్నమైన రీతిలో తీర్చిదిద్దిన వైనం. ఇద్దరూ పల్లె పిల్లలే. ఒక సినిమాలో డిగ్లామరైజ్డ్ పాత్రలో సమంత అపూర్వంగా మెప్పిస్తే.. సమంతకంటె తాను ఎంతో బెటర్ అన్నట్టుగా ఇప్పుడు మరో సినిమాలో రష్మిక మందన్న నిరూపించుకుంటోంది.
రంగస్థలం చిత్రంలోని సమంత పాత్రను ఎవ్వరూ అంత ఈజీగా మర్చిపోలేరు. పల్లెటూరి పాత్రలో సమంత ఒదిగిపోయింది. అదే దర్శకుడు సుకుమార్ ఇప్పుడు పుష్ప తీస్తుండగా.. అందులో అల్లు అర్జున్ సరసన చేస్తున్న రష్మిక మందన్న అంతకంటె మిన్నగా పాత్రలో అలరిస్తోంది. పుష్ప చిత్రంలో రష్మిక మందన్న ఫస్ట్ లుక్ ను తాజాగా విడుదల చేశారు.
అల వైకుఠపురంలో లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా.. రంగస్థలం లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా పుష్ప. ఆర్య, ఆర్య 2 సినిమాల తర్వాత హ్యాట్రిక్ చిత్రంగా పుష్ప సినిమా వస్తుంది.
ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు సుకుమార్. ఇందులో మొదటి భాగం పుష్ప: ది రైజ్ క్రిస్మస్ కానుకగా విడుదల కానుంది. వరుస బ్లాక్‌బస్టర్ చిత్రాలతో పవర్ ప్యాక్డ్ ప్రొడక్షన్ హౌజ్‌గా టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న మైత్రి మూవీ మేకర్స్, మరో నిర్మాణ సంస్ధ ముత్తంశెట్టి మీడియాతో కలిసి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన ప్రతీ అప్‌డేట్ కూడా సోషల్ మీడియాలో సంచలనం రేపింది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్, దాక్కో దాక్కో మేక పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఇవి కూడా చదవండి :
Good Morning : జ్ఞానార్జనకు అయిదు మెట్లు
టీటీడీ ట్రస్టు బోర్డు ఏరకంగా భ్రష్టు పట్టిపోయిందంటే..
పవన్ పై పోసాని ఆగ్రహం న్యాయమే
Good Morning : జ్ఞానార్జనకు అయిదు మెట్లు
టీటీడీ ట్రస్టు బోర్డు ఏరకంగా భ్రష్టు పట్టిపోయిందంటే..
పవన్ పై పోసాని ఆగ్రహం న్యాయమే
ఈ సినిమాలో ప్రతినాయకుడిగా జాతీయ అవార్డు గ్రహిత, మళయాలీ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్ నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి హీరోయిన్ రష్మిక మందన్న ఫస్ట్ లుక్ విడుదలైంది. శ్రీవల్లి పాత్రలో ఇందులో నటిస్తున్నారు రష్మిక. పూర్తిగా డీ గ్లామర్ లుక్ లో కనిపిస్తున్నారు రష్మిక మందన్న. చెవుల కమ్మలు పెట్టుకుంటూ ఉన్న ఆమె లుక్ ఆకట్టుకుంటుంది. దీనికి సంబంధించిన అధికారిక పోస్టర్ కూడా విడుదలైంది.
క్రిస్మస్ సందర్భంగా పుష్ప: ది రైజ్ విడుదల కానుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు చిత్రయూనిట్.

.

Discussion about this post