మత్తేరిమిట్టగ్రామంలో ఆ గ్రామ సర్పంచ్ అయినటువంటి సింధుజ రెడ్డి, తమ పంచాయితీ మొత్తం సొంత నిధులతో నిరు పేదలకు కుటుంబాలకు దుప్పట్ల పంపిణీ చేశారు.
వరదయ్యపాళెం మండలం లోని మత్తేరిమిట్ట గ్రామ పంచాయితీ కుటుంబాలకు సింగిల్విండో చైర్మన్ హరిబాబు రెడ్డి మరియు ఆ గ్రామ సర్పంచ్ అయినటువంటి సింధుజ రెడ్డి, అదేవిధంగా గ్రామ ఎంపీటీసీ శ్యామలమ్మ తదితరులు పేదలకు దుప్పట్ల పంపిణీ చేశారు.
తుపాన్ ప్రభావంతో ఆ గ్రామ పంచాయితీ పరిధిలో దెబ్బతిన్న కుటుంబాలకు ఇలాదుప్పట్ల పంపిణీ చేయడం జరిగింది.
ఈ సందర్భంగా సర్పంచ్ సింధుజ రెడ్డి మాట్లాడుతూ నేను మీకు అన్ని వేళల అందుబాటులో ఉండి సేవలను అందించేందుకు నేను సిద్ధంగా ఉంటామని తెలిపింది. అదేవిధంగా ఆ గ్రామ పంచాయితీ ప్రజలుకు దుప్పట్ల పంపిణీ చేసినందుకు ఎంతగానో కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎం డి ఓ , ఆ గ్రామ సెక్రెటరీ , విఆర్ఓ , వాలంటరీ స్, ఆశా వర్కర్లు, పాల్గొన్నారు.
.