ప్రస్తుత తుఫాను విపత్కర పరిస్థితిని సమర్థవంతంగా ఎదుర్కొందామని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పిలుపునిచ్చారు. ఆదివారం సాయంత్రం ఎమ్మెల్యే పిచ్చాటూరు విలేకరులతో మాట్లాడుతూ గత తుఫాను ను ఎదుర్కొన్న విధంగానే ప్రస్తుత పరిస్థితిని కూడా అధిగమించడానికి అధికారులు ప్రజాప్రతినిధులు సమిష్టిగా కృషి చేయాలన్నారు.
భారీ వర్షాల నేపథ్యంలో ఆదివారం జిల్లా కలెక్టర్ హరి నారాయణన్, తుఫాను జిల్లా ప్రత్యేకాధికారి ప్రద్యుమ్న, తిరుపతి ఆర్డిఓ కనక నరసారెడ్డి, నియోజకవర్గ ప్రత్యేక అధికారి దశరథరామిరెడ్డి నియోజకవర్గంలోని మండలాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారన్నారు.
స్థానిక అధికారులను అప్రమత్తం చేస్తూ ప్రధాన ప్రాజెక్టులైనా అరనియార్, కాళంగి జలాశయాన్ని సందర్శించిన స్థానిక ఇరిగేషన్ అధికారులకు సలహాలు, సూచనలు చేస్తున్నారన్నారు.
గత వారం కురిసిన భారీ వర్షాలకు జగనన్న ప్రభుత్వం వరద బాధితులకు నిత్యవసర వస్తువులు ఆర్థిక సాయం, దెబ్బతిన్న ఇళ్ళకు తక్షణ పరిహారం అందించి ఆదుకున్నారు అన్నారు.
ఈ వర్షాల కు కూడ కలిగే నష్టాలను తక్షణం అంచనావేసి ఉన్నతాధికారులు సమర్పించాలని ఆయన మండల స్థాయి అధికారులకు సూచించారు.
తుపాను వల్ల నష్టపోయిన ప్రతి ఒక్కరికి తప్పక సాయం పొందే విధంగా తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే భరోసా కల్పించారు. ఈరోజు, రేపు రాత్రి వేళల్లో మండల స్థాయి గ్రామ స్థాయి అధికార యంత్రాంగం పూర్తిగా బస చేసి ప్రజలకు అందుబాటులో ఉండాలని, ఎలాంటి విపత్కర పరిస్థితి ఎదురైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఆయన కోరారు..
.