వికలాంగుల కోసం ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్టు చిత్తూరు జిల్లా సత్యవేడు జెడ్పిటిసి విజయలక్ష్మి చంద్రశేఖర్ రెడ్డి గుర్తు చేశారు. శుక్రవారం స్థానిక భవిత భవనంలో ఎం ఈఓ రవి ఆధ్వర్యంలో వికలాంగుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు.
ముఖ్య అతిథులుగా జెడ్ పిటిసి విజయలక్ష్మి చంద్రశేఖర్ రెడ్డి ,ఎంపీడీవో సురేంద్రనాథ్, స్థానిక బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటేశులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా జెడ్పిటిసి విజయలక్ష్మి మాట్లాడుతూ ప్రస్తుతం అన్నింటా వికలాంగులకు సమాన అవకాశాలు కల్పిస్తున్నామన్నారు.
ఇందులో భాగంగానే అంద , బధిర ,మూగ వంటి ప్రత్యేక ప్రతిభావంతులకు విద్యాశాఖ ద్వారా ప్రత్యేక పాఠశాలలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
ఇదేగాక చదువుకోడానికి ఆసక్తి ఉన్న వికలాంగులకు ఆశ్రమ పాఠశాలలో, సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో సౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తున్నట్టు ఆమె చెప్పారు.
ఆర్థిక భద్రత లో భాగంగా సంక్షేమ శాఖ ద్వారా మానసిక వికలాంగులకు ఉపకార వేతనాలు కూడా పంపిణీ అవుతున్నట్టు ఆమె గుర్తు చేశారు.
చదువుకునే వికలాంగుల విద్యార్థులకు ఉచితంగా టేప్ రికార్డులు ,క్యాసెట్లు అందిస్తున్నట్టు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో మూడు శాతం రిజర్వేషన్ వికలాంగుల కోసం కేటాయించడం జరిగిందన్నారు . దీంతోపాటు వయోపరిమితిలో 10 సంవత్సరాల పాటు సడలింపు ఇచ్చినట్టు ఆమె పేర్కొన్నారు .
ప్రస్తుతం అనేక రంగాల్లో ప్రత్యేక ప్రతిభావంతులు తమ సత్తాను చాటుతో ఉన్నత ఉద్యోగాలు కూడా కొలువు తీరుతున్న విషయాన్ని ఆమె ప్రస్తావించారు .ప్రత్యేక ప్రతిభావంతులకు జీవన ఉన్నతకి అంగవైకల్యం అడ్డే కాదన్నారు . ఇందుకోసమే ప్రభుత్వం అంగ వికలాంగులకు మూడు చక్రాల బండ్లు ,వినికిడి యంత్రాలు ,చేతి కర్రలు ,కృత్రిమ అవయవాలు వంటి చలన పరికరాలను ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తున్నట్టు ఆమె పేర్కొన్నారు .
ఎంఈఓ రవి మాట్లాడుతూ మండలంలో 83 మంది ప్రత్యేక ప్రతిభావంతులు ఉన్నట్టు గుర్తించడం జరిగిందన్నారు . వీరికి ప్రతి వారం ఫిజియోథెరపి చికిత్స నిర్వహిస్తున్నట్టు ఆయన చెప్పారు .అంగ వికలాంగుల పిల్లలు తల్లిదండ్రులు కూడా వీటిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు .
ఈ నేపథ్యంలోనే ప్రత్యేక ప్రతిభావంతులకు అవసరమైన ఫిజియోథెరపీ పరికరాలు ,ఇతర ఆట వస్తువులు ఉచితంగా సమకూర్చడం జరిగిందని రాజు గోపాలపురం సర్పంచ్ మధురాజు భరోసా ఇచ్చారు .తదనంతరం ప్రత్యేక ప్రతిభావంతులకు బహుమతులను జడ్పిటిసి విజయలక్ష్మి చంద్రశేఖర్ రెడ్డి అందించారు .
అంగ వికలాంగుల దినోత్సవం ప్రత్యేక ప్రతిభావంతులకు పురస్కరించుకొని భోజన వసతి కల్పించడం జరిగింది .ఈ కార్యక్రమంలో పలు పంచాయితీ సర్పంచులు శేఖర్ ,రూబెన్ ,గోవిందస్వామి ,ఐఈఆర్ పి జయశంకర్ , పలువురు ప్రత్యేక ప్రతిభావంతులు పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
.