నందమూరి బాలయ్య బాబు అభిమానులకు గురువారం పండగ రోజు. చాలా కాలం గ్యాప్ తర్వాత.. బాలయ్యబాబు చిత్రం అఖండ రిలీజ్ అవుతుండడంతో వారు పండగ చేసుకుంటున్నారు.
నరసింహ లెజెండ్ అయినటువంటి నందమూరి బాలకృష్ణ అఖండ సినిమా రిలీజ్ సందర్భంగా శ్రీకాళహస్తిలో రామచంద్ర థియేటర్ వద్ద ఉదయం ఏడు గంటలకు పెద్ద పండగ వాతావరణం సృష్టించారు.
రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి బాలయ్య అభిమాని అయిన రెడ్డివారి గురువా రెడ్డి ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి.
అభిమానులతో కలిసి బాణాసంచా కాల్చి కేక్ కట్ చేసి పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించడం అయినది.
ఈ కార్యక్రమంలో కిట్టు సుబ్బయ్య ఆర్ముగం, షాకిర్ అలీ వెంకటేష్ చౌదరి గుణ ఖాదర్ ప్రతాప్ మురళి నాగరాజా మునయ్య కేవీ రమణ ప్రభాకర్ శ్రీనివాస్ కరీం తదితరులు పాల్గొన్నారు
.