అమరావతి రైతులు 45 రోజులపాటు చేస్తున్న మహా పాదయాత్ర నేడు 41 వ రోజున శ్రీకాళహస్తి పట్టణం నందు ప్రారంభమైంది.
న్యాయస్థానం నుండి మొదలైన ఈ పాదయాత్ర మరి కొన్ని రోజుల్లోనే తిరుమల దేవస్థానానికి చేరుకోబోతున్నది.
పాదయాత్ర పొడవునా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు పెద్దఎత్తున పాల్గొంటూ రాష్ట్రానికి ఒకే రాజధాని ఉండాలని అది అమరావతి మాత్రమే అవ్వాలని కోరుతూ రైతులతో కలిసి ముందుకు సాగుతున్నారు.
త్వరలోనే రైతుల, రాష్ట్ర ప్రజల కోరిక నెరవేరుతుందని ఆశిస్తున్నామని రైతులు అంటున్నారు.
శనివారం కార్యక్రమంలో బిజెపి తిరుపతి పార్లమెంటు జిల్లా కిసాన్ మోర్చా ఇంఛార్జి, బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు చంద్రప్ప, రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి, సీనియర్ నాయకులు జమ్ముల శ్యామ్ కిశోర్, రాష్ట్ర కార్యదర్శి కండ్రిగ ఉమ, జిల్లా మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు ఉమా సింగ్ తదితరులు పాల్గొన్నారు.
.