ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి మాత్రమే ఏకైక రాజధానిగా ఉండాలని న్యాయస్థానం నుండి దేవస్థానం వరకు 45 రోజుల పాటు అమరావతి రైతులు తలపెట్టిన మహా పాదయాత్రకు బీజేపీ మద్దతు ప్రకటించింది.
వెంకటగిరి నియోజకవర్గం నుండి శ్రీకాళహస్తి నియోజకవర్గంలోకి అడుగుపెట్టిన సందర్భంగా బిజెపి రాష్ట్ర మీడియా ప్రతినిధి కోలా ఆనంద్ కుమార్ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి స్వాగతం పలికారు.
ఈ కార్యక్రమంలో బిజెపి తిరుపతి పార్లమెంటు జిల్లా కిసాన్ మోర్చా ఇంఛార్జి, జిల్లా ఉపాధ్యక్షులు చంద్రప్ప, బిజెపి రాష్ట్ర కార్యదర్శి కండ్రిగ ఉమ, బిజెపి తిరుపతి పార్లమెంటు జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు సురేంద్ర రెడ్డితో కలిసి పాల్గొని రైతులతో కలిసి ముందుకు సాగారు.
.