శ్రీకాళహస్తి పట్టణం లోని 9వ వార్డు వాలంటరీగా పని చేస్తున్నటువంటి ఉమా మహేశ్వరి ఆత్మహత్యకు ప్రేరేపించినటువంటి కానిస్టేబుల్ వాళ్ళ తల్లి, అన్నా వదిన లపై సెక్షన్ 306 కేసు నమోదు చేయాలని సిపిఐ పార్టీ ఏరియా కార్యదర్శి జన మాల గురవయ్య పోలీసు అధికారులను డిమాండ్ చేశారు.
ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రిలో ఆకుటుంబాన్ని పరామర్శించారు.
ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రక్షణ కల్పించాల్సిన పోలీసు ఈ దుశ్చర్యకు పాల్పడితే మహిళలకు రక్షణ ఎక్కడ ఉందని ప్రశ్నించారు. గతంలో ఇతనిపై అనేక కేసులు ఉన్నాయని గుర్తుచేశారు.
నిన్నటి దినం ఉమా మహేశ్వరి తన తల్లిదండ్రులను లోబావి వద్దకు వాళ్ళను తీసుకొని పోయి బెదిరించారు. అంతేకాకుండా తన తండ్రి పైన కానిస్టేబుల్ చేసుకోవడంతో ఉమా మహేశ్వరి జీర్ణించుకోలేక నిన్న రాత్రి ఆత్మహత్య చేసుకొని చనిపోవడం జరిగింది అని చెప్పారు.
ఇప్పటికైనా పోలీసు జిల్లాస్థాయి అధికారులు ఈ కేసుపై పూర్తిస్థాయిలో సమగ్రవిచారణ జరిపి ఆ కానిస్టేబుల్ పైన వారికుటుంబం పైన శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని, వారినివెంటనే అరెస్టు చేయాలని కోరారు. ప్రభుత్వం ఉమామహేశ్వరి కుటుంబాన్ని ఆదుకోవాలని సిపిఐ పార్టీ డిమాండ్ చేస్తోందన్నారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు మల్లికార్జున్ గోపి ,గురవయ్య, ఏఐఎస్ఎఫ్ ఏరియా కార్యదర్శి సురేష్ పిడిఎస్యు జిల్లా కార్యదర్శి జాకీర్ తదితరులు పాల్గొన్నారు.
.