తిరుమలకు మూడో ఘాట్ రోడ్డు ప్రతిపాదన అర్థరహితమని తక్షణం ఉపసంహరించుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు.
ప్రత్యామ్నాయాలు ఏమాత్రం పరిశీలించకుండా అన్నమయ్య మార్గం పేరుతో రోడ్డు, నడక మార్గాలను అభివృద్ధి చేయాలని పరిపాలనాపరమైన ఆదేశాలు టిటిడి ఇవ్వడం సమంజసం కాదని పేర్కొన్నారు.
గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఈ ప్రతిపాదనపై తీవ్ర విమర్శలు రావడంతో ఉపసంహరించుకున్న విషయాన్ని గుర్తు చేశారు.
మొదటి, రెండవ ఘాట్ రోడ్డులలో తక్కువ ఖర్చుతో వెడల్పు చేయడం, రిపేర్లు చేయడం ద్వారా ప్రయోజనకరంగా మార్చవచ్చని… ఇవేవీ పట్టించుకోకుండా రక్షణ, వ్యయం తదితర సమస్యలు ఉండగా ఇలాంటి నిర్ణయం సమంజసం కాదని విమర్శించారు.
తక్షణం మూడో ఘాట్ రోడ్ ప్రతిపాదనను ఉపసంహరించుకుని టిటిడి నిధులను కాపాడాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వి. నాగరాజు విజ్ఞప్తి చేశారు.
.