శ్రీకాళహస్తిలో ఈ నెల 5వ తేదీ బుధవారం నుంచి జరగనున్న పీడీఎస్ యూ జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని ఆ యూనియన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జాకీర్ విజ్ఞప్తి చేశారు.
మహాసభలపై మంగళవారం పలు కళాశాలల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా జాకీర్ మాట్లాడుతూ… విద్యారంగం పట్ల ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందన్నారు.
ఫలితంగా విద్యాప్రమాణాలు అడుగంటి పోతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో దీర్ఘ కాలికంగా ఉన్న సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు.
ఇక పెరుగుతున్న ధరలక అనుగుణంగా మెస్, కాస్మోటిక్ ఛార్జీలు పెంచక పోవడంతో విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆయన చెప్పారు. ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో మౌలిక వసతులు కల్పించాలని డిమాండు చేశారు.
వసతి గృహాల్లో ఖాళీగా ఉన్న పోస్టలను భర్తీ వెంటనే భర్తీ చేయాలని కోరారు. ఈ సమస్యలపై చర్చించడానికి… కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయడానికి ఈ సభలు నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు.
ఈ సభలకు విద్యార్థులు తరలి రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్ యూ నేతలు ప్రదీప్, బాలాజీ, హేమంత్, సాయి, హరి తదితరులు పాల్గొన్నారు.
.