శ్రీకాళహస్తికి చెందిన ఆప్కో మాజీ డైరెక్టరు, వైసీపీ బీసీ విభాగం జిల్లా అధ్యక్షులు మిద్దెల హరి ఆధ్వర్యంలో మంగళవారం రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఇందులో భాగంగా శ్రీకాళహస్తి పట్టణంలోని ఆర్టీసీ బస్టాండు కూడలిలో ప్రత్యేక ప్రతిభావంతులకు ట్రై సైకిళ్లు పంపిణీ చేశారు. అదేవిధంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీకాళహస్తి శాసనసభ్యులు బియ్యపు మధుసూదనరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా బియ్యపు మధు మాట్లాడుతూ జగనన్న జన్మదినం పేదలకు పండుగగా అభివర్ణించారు.

తాను జగన్ ఛారిటబుల్ ట్రస్టు ఏర్పాటు చేసి.. 20 ఏళ్లుగా సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు ఆయన గుర్తు చేశారు. జగన్ జన్మదినం పురస్కరించుకుని మెగా రక్తదానం శిబిరాలు, అన్నదానం, ట్రై సైకిళ్ల పంపిణీ, వస్త్రదానం, తోపుడు బళ్లు పంపిణీ సేవా కార్యక్రమాలు చేపట్టడం ఆనందంగా ఉందన్నారు.
ప్రజలు, దేవుని ఆశీస్సులతో జగన్ నూరేళ్ల పాటు చల్లగా ఉండాలని ఆయన కోరుకున్నారు.
ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు మిద్దెల హరి, గుమ్మడి బాలక్రిష్ణయ్య, అంజూరు శ్రీనివాసులు, పగడాల రాజు, సిరాజ్ బాషా, చాన్ బాషా, ఆర్కాడు శేఖర్, చల్లా జయరామయ్య, మిద్దెల హరి యువసేన కార్యకర్తలు ఇసుక మట్ల బాల, దావాల గిరి, గంజి వెంకటేష్, ప్రబాకర్, ప్రభాకర్, చల్లా సుధాకర్, చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు.
.