శ్రీకాళహస్తి పట్టణంలో బీజేపీ రాష్ట్ర మీడియా ప్రతినిధి, శ్రీకాళహస్తి నియోజకవర్గ బీజేపీ పార్టీ ఇంఛార్జి శ్రీ ఆనందకుమార కోలా ఆధ్వర్యంలో బాబా సాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి.
లౌకికవాదం, దేశ సమగ్రతకు భంగం కలిగించే దుష్టశక్తుల వల్ల మన భారతదేశానికి ఎటువంటి ముప్పు వాటిల్లకుండా భారత రాజ్యాంగాన్ని నిర్మించి, సమ సమాజస్థాపన కొరకు తనవంతు పాత్ర పోషించిన మహనీయుడు, భారతరత్న అని కోలా ఆనంద్ కొనియాడారు.
ఆర్టీసీ బస్టాండ్ కూడలి వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి వారికి ఘనమైన నివాళులు అర్పించారు..
అంబేద్కర్ ఆశయాలను దేశంలో ఆచరణలోకి తెచ్చి, భారతదేశ ఔన్నత్యాన్ని, ప్రజాస్వామ్య స్ఫూర్తిని విశ్వవ్యాప్తం చేస్తూ, అణగారిన ప్రజల వికాసానికి, నిరంతరం శ్రమిస్తున్న, ప్రధాని నరేంద్రమోదీకి కోలా ఆనందకుమార ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో పట్టణ బీజేపీ పార్టీ అధ్యక్షులు కాసరం రమేష్, ప్రధాన కార్యదర్శి వజ్రం కిషోర్, బీజేపీ నాయకులు గరికపాటి రమేష్, యతీష్,ఈశ్వర్,కుమార్ పుణ్యం ఢిల్లీ, క్రిష్ణయ్య, కొండేటి గోపాల్, కిరణ్ మణి,ఇమిడి శెట్టి మోహన్,మంచినీళ్ల గుంట రాజా, భరత్, రవి, మండల నాయకులు గాండ్లశివకుమార్, జంగాలపల్లి సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.
.