అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకొని శ్రీకాళహస్తి లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి జైభీమ్ ఆర్మీ పులి శ్రీకాంత్ ఘన నివాళులర్పించారు. పులి శ్రీకాంత్ మాట్లాడుతూ ఈ రోజును ప్రపంచ బ్లాక్ డేగా గుర్తించాల్సింది డిమాండ్ చేశారు.
ఎందుకంటే ప్రపంచ మేధావుల ఒకరైన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భారతదేశం యొక్క ఖ్యాతిని, గౌరవాన్ని ప్రపంచ దేశాల మధ్య నిలబెట్టిన గొప్ప మేధావి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని అన్నారు. కానీ మన భారతదేశం చేసుకున్న పాపం ఆయన చేసిన త్యాగాలకు భారతదేశం అంబేద్కర్ గారిని భారతదేశ మేధావిగా ఎందుకు గుర్తించడం లేదు అని బాధపడ్డారు,
అంబేద్కర్ దళిత కుటుంబంలో జన్మించప్పటికీ ప్రపంచ దేశాలకు దీటుగా భారత రాజ్యాంగాన్ని నడిపించేందుకు ఒక రాజ్యాంగాన్ని రూపకల్పన చేసి ఈ దేశాన్ని ఒక క్రమశిక్షణలో నడిపించడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు కష్టపడి మనకు రాజ్యాంగం అందించారన్నారు.
అంబేద్కర్ ను గౌరవించి అన్ని ప్రభుత్వ కార్యాలయంలో, ముఖ్యంగా ప్రతి కోర్టులోనూ, పోలీస్ స్టేషన్ లోనూ ఆయన చిత్ర పటాన్ని ప్రతిష్ట ఉంచవలసిందిగా పార్లమెంట్లో జీవో తీసుకురావాలని ఆకాంక్షిస్తూ ప్రభుత్వాన్ని కోరడం జరిగింది.
ఈ కార్యక్రమంలో బాస్ ఇన్ ఏపీ నాయకులు కన్నలి రమేష్, షేక్ బషీర్ బాషా, కాగితాల మధు, గుడారి మధు, పసలు కుమార్, ఫెయిరి కస్తూరియ్య, రాష్ట్ర యానాది సంఘం అధ్యక్షులు చందమామ కోటయ్య, దళిత సీనియర్ నాయకులు కోగిల ధర్మయ్య, తదితరులు పాల్గొన్నారు.
.