సప్తగిరి గ్రామీణ బ్యాంకు ఆధ్వర్యంలో ఖాతాదారులకు మెరుగైన సేవలు అందిస్తున్నట్లు ఆ బ్యాంకు తిరుపతి ప్రాంతీయ కార్యాలయ సీనియర్ మేనేజరు శ్రీరాములు నాయక్ చెప్పారు.
శ్రీకాళహస్తి పట్ణణంలో గురువారం సప్తగిరి గ్రామీణ బ్యాంకు ఖాతాదారులకు రూ.1.75 కోట్లు రుణాలు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమానికి శ్రీరాములు నాయక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…ఖాతాదారులకు మెరుగైన సేవలందించడంలో గ్రామీణ బ్యాంకులు అన్నింటికి కంటే ముందు వరుసలో ఉన్నాయన్నారు.
అన్ని వర్గాల ప్రజల ఆర్థిక అభివృద్ధి కోసం వ్యవసాయంతో పాటు గృహ, వ్యాపార, వాహన, విద్యా రుణాలు అందిస్తున్నామని ఆయన చెప్పారు. స్వయం సహాయక సంఘాలకు రూ.20 లక్షలు మంజూరు చేస్తామన్నారు.
అన్ని రకాల ఋణాల పై భారీగా వడ్డీలు తగ్గించామన్నారు. తీసుకున్న రుణాలు సమయానికి చెల్లిస్తే వడ్డీ రాయితీ పొందడమే కాకుండా ఇంకొంత మందికి అవసరానికి రుణ సహాయం అందించే అవకాశం కలుగుతుందని శ్రీరాములు నాయక్ అభిప్రాయపడ్డారు.
బ్యాంకు అందిస్తున్న వివిధ రుణాలను సద్వినియోగ పరుచుకొని ఖాతాదారులు మెరుగైన ఆర్థిక అభివృద్ధిని సాధించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి శాఖ మేనేజర్ ఫల్గుణ కుమార్, బీయన్ కండ్రిగ మేనేజర్ నాగార్జున, ఇతర శాఖల మేనేజర్లు, ఖాతాదారులు పాల్గొన్నారు.
.