సంక్షోభంలో కూరుకు పోయిన చేనేత రంగాన్ని ఆదుకోవాలని జనసేన జిల్లా కార్యదర్శి అంజూరు చక్రధర్ డిమాండు చేశారు. ఈ మేరకు ఆయన సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
వైసీపీ ప్రభుత్వ చిన్నచూపుతో పాటు కొవిడ్ కారణంగా ఈ పరిశ్రమ కుదేలైందన్నారు. ఇలాంటి తరుణంలో కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ 12శాతానికి పెంచడం మరణ శాసనం రాసినట్లేనని ఆయన అభిప్రాయ పడ్డారు.
జీఎస్టీ పెంపు నిర్ణయంతో చేనేత పరిశ్రమకు తీవ్ర నష్టం వాటిల్లడమే కాకుండా… ఆ రంగాన్ని నమ్ముకొని జీవిస్తున్న లక్షలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోయే ప్రమాదముందన్నారు.
తమిళనాడు, తెలంగాణతో పాటు అనేక రాష్ట్రాలు చేనేత ఉత్పత్తులపై జీఎస్టీ పెంపుని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయన్నారు.
ఈ నిర్ణయం వెనక్కు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పంచుతున్నాయని పేర్కన్నారు. అయితే మన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తి నట్లు వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు.
ప్రభుత్వం ఇకనైనా స్పందించి చేనేత పరిశ్రమను ఆదుకోవడానికి తగు చర్యలు తీసుకోవాలని కోరారు.
.
.