చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో వెలసిన జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరుని గురువారం కైకలూరు శాసనసభ్యులు నాగేశ్వరరావు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.
ఆలయ కార్యనిర్వహణాధికారి పెద్దిరాజు దక్షిణ గోపురం వద్ద స్వాగతం పలికి దర్శన ఏర్ఫాట్లు చేశారు.
దర్శనానంతరం గురుదక్షిణామూర్తి సన్నిధిలో ఆలయ పండితులు ఆశీర్వచనం ఇచ్చారు. స్వామి, అమ్మవార్ల జ్ఞాపిక, తీర్థ ప్రసాదాలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో ఎన్ ఆర్ కృష్ణారెడ్డి, ఏఈవో ధనపాల్, ప్రోటోకాల్ సూపరింటెండెంట్ నాగభూషణ్ యాదవ్, ఏపీ ఆర్వోలు బాచి, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.
కాగా ఏపీ విద్యాశాఖ పరీక్షల విభాగం డైరెక్టరు దేవానందరెడ్డి కూడా కుటుంబ సమేతంగా స్వామి, అమ్మదవార్లను దర్శించుకున్నారు.
ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి మండల విద్యాశాఖాధికారిణి భువనేశ్వరి, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.

.