రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ జన్మదిన వేడుకలు మంగళవారం శ్రీకాళహస్తి పట్టణంలోని పెళ్లి మండపం వద్ద జిల్లా అధికార ప్రతినిధి అంజూరు తారక శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా అంజూరు శ్రీనివాసులు వృద్ధులకు దుప్పట్లు, విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు.
అదేవిధంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో వయ్యాల కృష్ణా రెడ్డి, గుమ్మడి బాలకృష్ణయ్య, పగడాల రాజు, శేఖర్, హరి, గణేష్, కుమారస్వామి, లీలా, రమేష్, ధన, బాల, కళ్యాణ్, సూర్య, ప్రసాద్, సుధీర్, జగన్, గంధం కిషోర్, సిరాజ్ భాషా, అన్వర్, మహిళా నాయకులు సునీతాసింగ్, రెడ్డెమ్మ, ఇందిరమ్మ, జయశ్రీ తదితరులు పాల్గొన్నారు.
.