బద్వేలు ఉప ఎన్నిక విషయంలో విపక్ష పార్టీలన్నింటికీ ఒక గొప్ప ఎడ్వాంటేజీ వచ్చింది. ఎన్నికల్లో దిగాలంటే భయం.. దాన్ని కవర్ చేసుకోడానికి, తమలోని పలాయనవాదానికి రాజకీయ విలువల ముసుగులు తొడుగుతున్నారు.
బద్వేలు ఎస్సీ నియోజకవర్గం నుంచి వైసీపీ ఎమ్మెల్యే గుంతోటి వెంకటసుబ్బయ్య హఠాన్మరణంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యం అయింది. ఇప్పటికే నోటిఫికేషన్ కూడా వచ్చేసింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. వెంకటసుబ్బయ్య భార్య డాక్టర్ సుధనే అక్కడ తమ పార్టీ అభ్యర్థిగా ప్రకటించేశారు. అక్కడ ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలనే విషయంలో.. ఒక విడత కార్యచరణ సమావేశం కూడా పూర్తి చేశారు. అక్కడినుంచే విపక్షాల హైడ్రామా, నాటకాలు మొదలయ్యాయి.
నిజానికి, బద్వేలు ఉపఎన్నికలో తమ పార్టీ అభ్యర్థిని పోటీచేయించాలనే తెలుగుదేశం అనుకుంది. గత ఎన్నికల్లో 44 వేల పైచిలుకు ఓట్ల తేడాతో ఓడిపోయిన ఓబుళాపురం రాజశేఖర్ నే ఈసారి కూడా బరిలోకి దించాలని తొలుత నిర్ణయించారు. ఆయనకూడా అక్కడ ఎన్నికలకు సన్నాహాల్లోనే ఉన్నారు. వికీపీడియాలో కూడా ఆయన 2021 ఉప ఎన్నికలో తెదేపా అభ్యర్థి అవుతున్నట్లే ఉంది. (ఇప్పటివరకు) అయితే ఆదివారం నాడు తెలుగుదేశం తమ ఆలోచన మార్చుకుంది. బద్వేలులో ఎవరినీ పోటీ పెట్టరాదని నిర్ణయించింది.
పవన్ కల్యాణ్ లో ఇంకో రకం భయం
వైసీపీ ప్రభుత్వం మీద ఒంటికాలితో లేస్తూ.. తాను లేస్తే మనిషిని కాదన్నట్లుగా డైలాగులు వల్లెవేస్తున్న జనసేనాని పవన్ కల్యాణ్ కూడా బద్వేలు ఎన్నిక విషయంలో చేతులు ఎత్తేశారు. ఈ సందర్భంగా.. తాము పోటీచేయడం లేదని అంటూ చాలా నీతులు వల్లించారు. మరణించిన అభ్యర్థి కుటుంబానికే టికెట్ ఇచ్చినందును నైతిక విలువలకు కట్టుబడి పోటీ చేయడం లేదని అన్నారు. తెలుగుదేశం కూడా ఇదే డైలాగులు చెప్పింది.
అయితే పవన్ కల్యాణ్, నాలుగురోజుల కిందట విజయవాడలో బీజేపీ నాయకులతో సమావేశమై బద్వేలు ఉప ఎన్నిక గురించి మాట్లాడారు. ఆ ఎన్నికలో వారినే పోటీచేయమని అన్నట్లుగా సమాచారం. తాము తప్పుకోవాలని ఆయన చూశారు. బీజేపీ కూడా అదే ఆలోచనతో అప్పటికి ఉంది. పవన్ మీద బద్వేలు భారం నెట్టేయాలని వారు చూశారు. నిజానికి పవన్ కల్యాణ్ పార్టీ నుంచి.. గత 2019 ఎన్నికల్లో ఇండిపెండెంటుగా పోటీచేసి ఓడిపోయిన విజయజ్యోతి కి ఫోన్ చేశారని.. అభ్యర్థిత్వం ఇస్తే బరిలోకి దిగడం గురించి సంప్రదించారని వార్తలు వచ్చాయి. ఆమె మొగ్గు చూపించారు గానీ.. తర్వాత పవన్ కల్యాణ్.. ఎందుకొచ్చిన కొత్త ఓటమి అనే భయంతో వెనక్కు తగ్గినట్టుగా కనిపిస్తోంది.
కానీ పవన్ కల్యాణ్ తెలివిగా నైతికవిలువల ముసుగులో అసలు పోటీనుంచి తప్పించుకున్నారు.
ఆడలేని నాట్యగత్తె మద్దెల ఓడు అన్న చందంగా ఈ రెండు పార్టీల వ్యవహారం ఉన్నదని అందరూ నవ్వుకుంటున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గట్టి విజయం సాధించడానికి పార్టీ వారితో మంతనాలు సాగిస్తున్నారు గానీ.. చూడబోతే.. ఏకగ్రీవ విజయమే పార్టీని వరించేలా ఉంది.
ఇవి కూడా చదవండి :
సినిమా ఇండస్ట్రీలో అరాచక విశృంఖలపోకడలపై సీనియర్ జర్నలిస్ట్ ‘రామ్’బాణం
వేదనలో సమంత.. లొకేషన్ లోనే కన్నీళ్లు పెట్టుకున్న వైనం
movie review : కంటతడి పెట్టించే సినిమా ‘రిపబ్లిక్’
కేబినెట్ ప్రక్షాళన ఒక సమరం : జగన్ vs ముగ్గురు బలమైన మంత్రులు
రోజా సీటు కింద పెద్దిరెడ్డి కుంపటి రాజేస్తున్నారా
అరెస్టు నుంచి రక్షణ కవచం.. సిఆర్‌పిసి 41 (ఎ)
పవన్ కల్యాణ్ పై పోసాని ఆగ్రహం న్యాయమే
టీటీడీ బోర్డు భ్రష్టు పట్టిపోయిన చరిత్ర – పార్ట్ 1
టీటీడీ బోర్డు భ్రష్టు పట్టిపోయిన చరిత్ర – పార్ట్ 2
పవన్ కల్యాణ్ ఒంటరి అయిపోయాడా?
అవినీతి కేసుల్లో ఉన్న ఐఏఎస్ శ్రీలక్ష్మి .. తర్వాత ఎపీ సీఎస్ అవుతారా?
.

Discussion about this post