మాతృభూమితో మమేకమై సేవ అందించడంలో ఎన్నారై తెలుగు ప్రజలు ఎప్పుడూ ముందుంటారని.. తానా అధ్యక్షుడు అంజయ్య అన్నారు. శుక్రవారం ఆయన తిరుపతికి విచ్చేశారు.
తానా అధ్యక్షులు అంజయ్య తిరుపతి కి విచ్చేసిన సందర్భంగా తిరుపతి ఎయిర్ పోర్ట్ లో తెలుగుదేశం పార్టీ చిత్తూరు పార్లమెంటు అధ్యక్షులు పులివర్తి నాని ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు.
తానా అధ్యక్షులు అంజయ్యకు స్వాగతం పలికిన వారిలో తిరుపతి పార్లమెంట్ తెలుగుదేశం అధ్యక్షులు నరసింహ యాదవ్, తిరుపతి నియోజకవర్గ ఇన్చార్జ్ సుగుణమ్మ, ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీ అధినేత మోహన్ తదితరులు ఉన్నారు.
తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు అంజయ్యను దుశ్శాలువతో సత్కరించి స్వాగతం పలికారు.
వారితో పాటు తెలుగు యువత తిరుపతి పార్లమెంటు అధ్యక్షులు రవి నాయుడు,వేమూరి మధు,ఈశ్వర్ రెడ్డి, గౌస్ బాషా, సుబ్రహ్మణ్యం నాయుడు, గంగంపల్లి భాస్కర్ , హరి ,భాస్కర్ రెడ్డి తదితరులు ఉన్నారు.
.

Discussion about this post