శ్రీకాళహస్తిలో వెలసిన జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరస్వామిని శుక్రవారం తిరుపతి దేవాదాయశాఖ రీజనల్ జాయింట్ కమిషనరు కె.సాగర్ బాబు దర్శించుకున్నారు.
ఆలయ కార్యనిర్వహణాధికారి పెద్దిరాజు ఈయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.
దర్శనానంతరం గురుదక్షిణామూర్తి సన్నిధిలో ఆలయ పండితులు ఆశీర్వచనం ఇచ్చారు.
స్వామి, అమ్మవార్ల జ్ఞాపిక, తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు పాల్గొన్నారు.
.