• About Us
  • Contact Us
  • Our Team
Monday, July 27, 2026
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
No Result
View All Result

నగేష్ : సహృదయుడు డాలర్ శేషాద్రి మామ!

admin by admin
November 29, 2021
0
నగేష్ : సహృదయుడు డాలర్ శేషాద్రి మామ!

డాలర్ శేషాద్రి అలియాస్ పాల శేషాద్రి. 2001 లో హైదరాబాద్ నుంచి వార్త దిన పత్రికకు తిరుమల స్టాఫ్ రిపోర్టగా వచ్చినప్పటి నుంచి నాకు బాగా పరిచయం. మొదట్లో స్వామీ అని పిలిచే నేను ఆ తరువాత కొందరు మిత్రుల లాగే మామ అని స్వామి అని పిలిచే వాడిని.

క్రమంగా మా ఇద్దరి మధ్య సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి. ఎక్కడ కనిపించినా ‘ఎన్న నగేష్ నల్ల ఇరుక’ అని తమిళంలో పలుకరించేవారు. తిరుమల శ్రీవారి ఆలయ విశేషాలు, స్వామి వారికి ఆకాశరాజు ఇచ్చిన కిరీటం నుంచి శ్రీ కృష్ణ దేవరాయలు, మహమ్మదీయ రాజులు, ఆంగ్లేయ పాలకుల నుంచి నేటి వరకు అందిన బంగారు, వజ్ర, కెంపు ఇతర ఆభరణాల వివరాలు ఆయన నోటి మీదే ఉంటాయి. ఏ ఆభరణం ఎప్పుడు ఎవరు కానుకగా ఇచ్చారు అందులో బంగారం ఎంత, వజ్రాలు ఎన్ని క్యారెట్లు ఉన్నాయి అనే సమస్త వివరాలు క్షణం ఆలోచించకుండా చెప్పగలిగే వ్యక్తి ఆయన.

ఆయనతో ఉన్న సాన్నిహిత్యం వల్ల 2002 లో నేను తిరుపతి ఆంధ్రజ్యోతి జిల్లా ఇంచార్జ్ గా పనిచేసిన సమయంలో మా ఎడిషన్ ఇంఛార్జ్ ఆర్ ఎం ఉమామహేశ్వరరావు గారి సలహా మేరకు తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి ఉన్న ఆభరణాలన్నింటి మీద ఆదివారం అనుబంధానికి ఒక స్టోరీ చేయాలని అనుకున్నాను. ఇది నా కెరీర్ లో మంచి డాక్యుమెంట్ అవుతుందని ఎడిషన్ ఇంచార్జ్ ఉమామహేశ్వరరావు ప్రోత్సహించారు.

శ్రీవారి ఆభరణాల సమస్త సమాచారం సంపాదించాలంటే అంత సులువు కాదు. అయినా, శేషాద్రి మామ ఉన్నాడు కదా అని ఒక రోజు తిరుమలలో ఆయన ఇంటికి వెళ్ళి విషయం చెప్పాను. ఒక రకంగా ఇదికూడా శ్రీవారి సేవేలే అని ఆభరణాల వివరాలు చెప్పడానికి శేషాద్రి స్వామి ఓకే చెప్పారు.

టీటీడీ ప్రజా సంబంధాల విభాగం సహకారం తో కొన్ని, శేషాద్రి స్వామి సహకారం తో మరి కొన్ని అపురూపమైన ఆభరణాల ఫోటోలు సంపాదించాను. ఇంకోరోజు ముందుగానే సమయం తీసుకుని శేషాద్రి స్వామి ఇంటికి వెళ్ళి ఒక్కో ఫోటో ఆయనకు చూపించడం దాని పూర్తి పేరు ఎప్పుడు ఎవరు కానుకగా ఇచ్చారు. అందులో బంగారు ఎంత, వజ్రాలు ఎన్ని అనే వివరాలు ఆయన చెబితే నోట్ చేసుకోవడం జరిగింది. ఈ పని పూర్తి కావడానికి 3 నుంచి 4 గంటల సమయం పట్టింది.

నేను రాసిన కథనానికి ఉమా సర్ తుది మెరుగులు దిద్దారు. అప్పటి చీఫ్ రిపోర్టర్, ఇప్పటి నెట్ వర్క్ఇంచార్జ్ మాధవ్  బ్రిటీష్ హయాంలో దత్త మండలాల కలెక్టర్ సర్ థామస్ మన్రో స్వామి వారి ప్రసాదాల తయారీకి కానుకగా ఇచ్చిన గంగాళం వివరాలు జోడించి నా ద్వారా ఆ ఫోటో కూడా తెప్పించుకున్నారు. మిత్రుడు, ఫోటో గ్రాఫర్ ఐ. సుబ్రమణ్యం అలియాస్ సుబ్బు తన వంతు సహకారం అందించారు.

పదిరోజుల తరువాత ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధం లో ‘‘వెంకన్నాస్ గోల్డ్’’ అనే శీర్షికన కవర్ పేజీ స్టోరీ వచ్చింది.

శనివారం రోజే ఈ ఆర్టికల్ ను నా బై లైన్ (పేరు)తో చూసుకున్న నాకు చెప్పలేనంత సంతోషం కలిగింది. సోమవారం రోజు ఒక బుక్కు తీసుకుని పోయి శేషాద్రి స్వామికి ఇచ్చి విలువైన సమాచారం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపాను. చాలా బాగా రాశావని నన్ను ఆయన అభినందించారు. అప్పటి నుంచి ఇప్పటి దాకా శ్రీవారి ఆభరణాల గురించి కథనాలు రాయాలనుకునే చాలామంది జర్నలిస్టులకు నేను రాసిన ‘‘వెంకన్నాస్ గోల్డ్’’ స్టోరీ సమాచారం కోసం ఉపయోగ పడుతోందని చెప్పగలను.

EXCLUSIVE ARTICLES
సీనియర్ జర్నలిస్టు గోవిందరాజు చక్రధర్ వ్యాసాల ప్రత్యేకపేజీ కోసం క్లిక్ చేయండి
‘సుభాషితం’ సంస్కృతశ్లోకాలకు భావవివరణల వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు బీరక రవి ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు డాక్టర్ ఎస్ రాము ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
దేవీప్రసాద్ ఒబ్బు లోపలిమాట వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సంపాదకుడు సురేష్ పిళ్లె వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి

నా జర్నలిస్టు ప్రయాణంలో ఇలాంటి ఒక మైలు రాయి దాటడానికి శేషాద్రి మామ సహకారం ఎంతో ఉపయోగ పడింది.

ఇక పోతే మరోసారి శేషాద్రి స్వామి గురించి ఆంధ్రజ్యోతి లో నెగటివ్ స్టోరీ రాయాలని ప్లాన్ చేశాము. నెగటివ్ అంటే ఆయన ఆలయ వైదిక కార్యక్రమాలతో సంబంధం లేకపోయినా అందులో ఇన్వాల్వ్ కావడం, ప్రముఖులు ఎవరు వచ్చినా ఫోటోల కోసం వారితో కలిసి నిల్చోవడం లాంటివి మాత్రమే.

Also Read : మంచితనం నిరూపించుకున్న వైసీపీ ఎమ్మెల్యే భూమన

డాలర్ శేషాద్రి మీద స్టోరీ అంటే దాని ప్రాధాన్యత ఎలా ఉంటుందో వేరుగా చెప్పాల్సిన పనిలేదు. అది మెయిన్ పేజీ బ్యానర్ స్టోరీ అయ్యింది. శేషాద్రి స్వామి నిలువెత్తు ఫోటో వేశారు. అది కూడా సంచలనమే. నాకు తెలిసినంత వరకు అప్పటి దాకా బహుశా శేషాద్రి స్వామి మీద ఈ తరహా స్టోరీ రాసిన వారు లేరు. అందుకే ఆ స్టోరీకి విపరీతమైన స్పందన వచ్చింది.

మూడు రోజుల తరువాత తిరుమల లో శేషాద్రి స్వామిని కలిశాను. పలకరింపులో ఉండే ప్రేమలో- అంతకుముందుకు ఆరోజుకు  ఏ మాత్రం తేడా లేదు. కొంత సేపటి తరువాత నా ఫోటో చాలా బాగా వేశావు. నీ పని నువ్వు చేశావులే అని నవ్వుతూ చాలా సింపుల్ గా మాట్లాడారు. స్వామివారికి సేవ చేయడం అంటే నాకు పిచ్చి అందుకే వైదిక కార్యక్రమాల్లో అర్చకులు, అధికారులకు సహాయం చేస్తూ ఉంటానని చెప్పారు.

Also Read : ఈ రాశుల్లో పుడితే.. ప్రేమను బయటకు చెప్పలేరుట!

ఇక ఫోటోల గురించి మాట్లాడుతూ, ‘‘ప్రముఖులతో ఫోటోలు దిగడం నా కొక సంతోషం అంతే. ఈ పరిచయాలను ఎప్పుడూ నా సొంతానికి ఉపయోగించుకోలేదు.ఇక మీదట కూడా ఉపయోగించుకోను నగేష్’’ అని మెత్తగా చెప్పారు. అరే,, ఈ విషయం స్టోరీలో ఆయన మాటగా రాసుంటే బాగుండేది కదా అని నాకు అనిపించి అదే విషయం శేషాద్రి స్వామి తో చెబితే ఏం పరవాలేదులే ఈ విషయం అందరికీ తెలుసు కదా అని సింపుల్ గా నవ్వారు.

అప్పటి నుంచి ఇప్పటి దాకా కూడా నేను ఒక్కడే కానీ, కుటుంబ సభ్యులతో కానీ స్వామివారి దర్శనానికి వెళ్ళిన సమయంలో ఆలయంలో శేషాద్రి మామ ఉంటే పలుకరించి పక్కకు తీసుకునే వారు.

Also Read : చంద్రబాబు కన్నీళ్లు ఆయనకు మేలు చేస్తున్నాయా? నిజమేనా?

ఈ మధ్య ఆయనకు గుండె సంబంధిత సమస్య వచ్చి చెన్నైలో వైద్యం చేయించుకుని వచ్చాక తిరుమలలో కలిశాను. ఆరోగ్యం బాగానే ఉందా స్వామి అని అడిగితే, దాని పని దానిది, నా పని నాది అని 43 సంవత్సరాల పాటు స్వామివారి సేవలోనే తరించిన శేషాద్రి స్వామి చెప్పారు. పవిత్రమైన కార్తీక మాసంలో విశాఖపట్నం లో టీటీడీ సోమవారం నిర్వహించే కార్తీక దీపోత్సవం లో పాల్గొని స్వామివారి సేవ చేయాలని వెళ్ళిన శేషాద్రి స్వామి అక్కడే కన్నుమూశారు. డాలర్ మామకు నా అక్షర నివాళులు. ఆయన ఆత్మ శాంతించాలని శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని ప్రార్థిస్తున్నాను.

.. నగేష్
ఓఎస్డీ, టీటీడీ ప్రజాసంబంధాల విభాగం

 

Also Read : మగాళ్ల దినోత్సవం రోజున మోడీ వెనక్కి తగ్గితే, చంద్రబాబు వెక్కి వెక్కి ఏడ్చాడు

ప్రత్యక్ష రాజకీయాల్లోకి నారా భువనేశ్వరి!

Tags: dollar seshadridollar seshadri storynageshseshadri storyడాలర్ శేషాద్రిడాలర్ శేషాద్రి స్టోరీతిరుమల డాలర్ శేషాద్రిశేషాద్రి కన్నుమూత
Subscribe
Login
Notify of
guest
Optional

guest

0 Comments
Oldest
Newest Most Voted

Top Read Stories

28 జూన్ 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

5 జులై 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

19.7.26 కథానిధి సమీక్ష: సమకాలీన కల్లోల జీవిత చిత్రణ

28.6.26 ‘కథానిధి’ సమీక్ష: వర్తమాన సామాజిక వాస్తవికత

12 జులై 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

5.7.26 ‘కథానిధి’ సమీక్ష: సామాజిక రుగ్మతలపై అక్షరాల తిరుగుబాటు

VIDEO

https://www.youtube.com/watch?v=4IsF6u52r8o&autoplay=1&mute=1
Adarsini

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

Navigate Site

  • About Us
  • Contact Us
  • Our Team

Follow Us

No Result
View All Result
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

error: adarsini.com Content is protected !!
wpDiscuz
0
0
Would love your thoughts, please comment.x
()
x
| Reply