చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలో వెలసిన జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరస్వామిని శుక్రవారం బుల్లి తెర నటుడు మానస్ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు.
ఆలయ అధికారులు ఈయనకు స్వాగతం పలికారు.
మానస్ మొదట రాహు-కేతు సర్పదోష నివారణ పూజలు చేసుకున్నారు. అనంతరం స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు.
దర్శనానంతరం గురుదక్షిణామూర్తి సన్నిధిలో ఆలయ పండితులు ఆశీర్వచనం ఇచ్చారు. స్వామి, అమ్మవార్ల జ్ఞాపిక, తీర్థ ప్రసాదాలు అందచేశారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ ఏరియా కార్యదర్శి జనమాల గురవయ్య, వే ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ పైడి అంకయ్య, వినయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
.