తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి నిరంతర కృషి చేస్తానని ఆ పార్టీ తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గం మైనారిటీ సెల్ ప్రధాన కార్యదర్శి జిలానీ బాషా చెప్పారు.
శ్రీకాళహస్తికి చెందిన జిలానీ బాషాను తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గం మైనారిటీ సెల్ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గురువారం రాత్రి ఉత్తర్వులు ఇచ్చారు.
ఈ నేపథ్యంలో మైనారిటీ నేతలు శుక్రవారం శ్రీకాళహస్తిలో నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిలానీ బాషా మాట్లాడుతూ.. శ్రీకాళహస్తి నియోజక వర్గం ఇన్ చార్జి బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఆశీస్సులతోనే ఈ పదవి తనకు దక్కిందన్నారు.
తనకు ఈ బాధ్యతలు అప్పగించిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు… వైసీపీ పాలనలో ముస్లిం మైనారిటీ లకు జరిగిన మోసాలను ప్రజలకు తెలియ చేస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు షాకీరాలీ, షఫీ, కరీం, ఖలీల్ , అస్మత్, హుమైన్, వెంకటేశ్వర చౌదరి, ప్రతాప్, మురళి, గోపి, నాదముని, బుజ్జి తదితరులు పాల్గొన్నారు.
.