• About Us
  • Contact Us
  • Our Team
Friday, September 4, 2026
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
No Result
View All Result

ఏపీ రాజకీయాలను ఇంకా శాసిస్తున్న వైఎస్ విజయమ్మ!

admin by admin
September 29, 2021
0
ఏపీ రాజకీయాలను ఇంకా శాసిస్తున్న వైఎస్ విజయమ్మ!

వైఎస్ రాజశేఖర్ రెడ్డి భార్య వైఎస్ విజయమ్మ క్రియాశీల రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకున్నట్టే.. అనే అభిప్రాయమే ప్రజలందరిలోనూ నిన్నటిదాకా ఉంది. కొడుకు జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి పీఠంపై అధిష్ఠింపజేసిన తర్వాత.. ఆమె ఏపీ రాజకీయాల్లో క్రియాశీలంగా  కనిపించలేదు. కానీ.. కొన్ని చోట్ల ఇక్కడి రాజకీయ పరిణామాలను ఆమె ఇంకా శాసిస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి.

వైఎస్ మరణం తర్వాత.. రాజకీయంగా డైరెక్ట్ ఎంట్రీ ఇచ్చిన విజయమ్మ జయాపజాయలను సమంగా రుచిచూశారు. జగన్ ని సీఎం చేయడానికి చాలా కష్టపడ్డారు కూడా. అది అయిన తర్వాత ఇక ఏపీ రాజకీయాల్లో కనిపించలేదు. కూతురు షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టిన తర్వాత.. అక్కడి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గానే కనిపిస్తున్నారు. అయితే ఆమె పూర్తిగా ఏపీ పాలిటిక్స్ కు దూరం కాలేదు. ఇక్కడి వ్యవహారాలను అక్కడినుంచి రిమోట్ గానే శాసిస్తున్నారని అర్థమవుతోంది.

నెల్లూరు జిల్లా జడ్పీ ఛైర్మన్ ఎన్నికలో స్థానిక మంత్రులు, బలవంతులైన నాయకులు, ముఖ్యమంత్రి ప్రాపకం సంపాదించిన ప్రముఖులు వీరెవ్వరిదీ కాదు. విజయమ్మదే అసలు కీలక పాత్ర. వైఎస్ విజయమ్మ ఆశీస్సులతోనే.. స్థానిక నేతలు, మంత్రికి కిట్టకపోయినప్పటికీ.. ఆనం అరుణమ్మ జడ్పీ పీఠాన్ని దక్కించుకున్నారు. ఆమె ఆనం విజయకుమార్ రెడ్డి భార్య.

జిల్లా రాజకీయాల్లోనే ఆనం కుటుంబానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలాంటి ప్రాధాన్యమూ దక్కడానికి వీల్లేదనేది స్థానిక నేతల పట్టుదల. అటు మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గానీ, రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గానీ ఇదే వ్యూహంతో పావులు కదుపుతున్నారు. వీరిద్దరూ ఒకే పార్టీలో ఉన్న బద్ధ శత్రువులే అయినప్పటికీ.. ఆనం కుటుంబాన్ని రాజకీయంగా అణిచేసే విషయంలో మాత్రం ఇద్దరిదీ ఒకేబాట, ఒకే మాట.

ఆ స్థాయిలో ఇద్దరు ప్రబలమైన నాయకులతో విభేదం, వారి వ్యతిరేకత ఉన్నప్పటికీ.. రూరల్ జడ్పీటీసీ టికెట్ ను ఆనం అరుణమ్మ దక్కించుకోవడమే హైడ్రామాగా జరిగింది. రూరల్ నియోజకవర్గంలో ఆనం విజయకుమార్ రెడ్డి ఏనాటికైనా తనకు ప్రమాదకరంగా మారుతాడనే ఆలోచన ఉన్న శ్రీధర్  రెడ్డి.. అసలు పొసగనివ్వలేదు. అయితే డైరక్ట జగన్ నిర్దేశంతో అరుణమ్మకు టికెట్ వచ్చింది.

ఆ ఎన్నిక ముగిసన తర్వాత.. ఏకంగా జడ్పీ ఛైర్మన్ పదవిని కూడా అరుణమ్మ దక్కించుకుంది. ఆనం కుటుంబం చేతిలోకి విలువైన పదవి వెళ్లడానికి రూరల్ ఎమ్మెల్యేకు ఇష్టం లేదు. నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి తన భార్యకు ఆ పదవి దక్కించుకోవాలని చాలా ప్రయత్నించారు. మంత్రి అనిల్ కుమార్ కు ఆమె ఎంపిక గురించి ఎలాంటి సమాచారం లేదు. విజయకుమార్  రెడ్డి కొడుకు విజయమ్మ అనుగ్రహంతో.. తల్లికి పదవి దక్కేలా చక్రం తిప్పాడు. నెల్లూరు జిల్లా పరిషత్ రాజకీయాల్లో మాత్రం.. పార్టీ వ్యవహారం.. వైఎస్ విజయమ్మ కనుసైగల్లోనే జరిగింది. ఆనం అరుణమ్మ జడ్పీ చైర్మన్ అయ్యారు.

ఇవి కూడా చదవండి :
కేబినెట్ ప్రక్షాళన ఒక సమరం :   జగన్ vs ముగ్గురు బలమైన మంత్రులు
రోజా సీటు కింద పెద్దిరెడ్డి కుంపటి రాజేస్తున్నారా
మన విలువను వ్యక్తిత్వాన్ని మనం కాపాడుకోవడం అవసరం
అరెస్టు నుంచి రక్షణ కవచం.. సిఆర్‌పిసి 41 (ఎ)
పవన్ కల్యాణ్ పై పోసాని ఆగ్రహం న్యాయమే

టీటీడీ బోర్డు భ్రష్టు పట్టిపోయిన చరిత్ర – పార్ట్ 1
టీటీడీ బోర్డు భ్రష్టు పట్టిపోయిన చరిత్ర – పార్ట్ 2

మొత్తానికి బయట ఎక్కువగా కనిపించకపోయినప్పటికీ.. జగన్మోహన్ రెడ్డి ద్వారా.. తనకు ఇష్టమైన కొందరి విషయాలలో వైఎస్ విజయమ్మ రాజకీయాలను ఇంకా శాసిస్తూనే ఉన్నారని ఈ పరిణామాలు నెల్లూరు జిల్లా ప్రజలకు నిరూపించాయి.

Tags: anam arunammaanam vijayakumar reddyanam vivekaanil kumar yadavjaganmohan reddynellore politicsnellore zp chairmannellore zp politicssridhar reddyys rajasekhara reddyys rajasekhara reddy wifeys vijayammaysr wifeysrcp internal politics
Subscribe
Login
Notify of
guest
Optional

guest

0 Comments
Oldest
Newest Most Voted

Top Read Stories

9.8.26 కథానిధి సమీక్ష: అక్షరాలే అసలైన కాపలాదారులు

23 ఆగస్టు 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

2.8.26 కథానిధి సమీక్ష: సామాజిక వాస్తవికతకు అక్షర దర్పణం

9 ఆగస్టు 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

సురేష్ పిళ్లె: ఘనీభవన స్థితి ‘కడెవర్ భారతి’

02 ఆగస్టు 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

VIDEO

https://www.youtube.com/watch?v=4IsF6u52r8o&autoplay=1&mute=1
Adarsini

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

Navigate Site

  • About Us
  • Contact Us
  • Our Team

Follow Us

No Result
View All Result
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

error: adarsini.com Content is protected !!
wpDiscuz
0
0
Would love your thoughts, please comment.x
()
x
| Reply