తిరుపతి జిల్లా తొట్టంబేడు మండలం బోనుపల్లె దళితవాడలో శాంతి(33) అనే వలంటీరు ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన బుధవారం అర్ధరాత్రి జరిగింది.
స్థానికుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. శాంతి కొంతకాలంగా బోనుపల్లె దళితవాడలో వలంటీరుగా పని చేసేది. ఈమె ఆరేళ్లుగా తరచూ కడుపునొప్పితో బాధపడుతూ ఉండేది.
ఇదిలా ఉండగా బుధవారం రాత్రి బోనుపల్లె దళితవాడలో విద్యుత్ సరఫరా లేని సమయంలో రేకుల కప్పుకు ఉరి వేసుకుంది. కొద్దిసేవటి తరువాత కుటుంబ సభ్యులు గమనించి ఉరి తప్పించి.. కిందకు దించారు.
అప్పటికే శాంతి మృతి చెందినట్లు గుర్తించారు. శాంతికి భర్త నాగయ్య… ఆరేళ్ల బాలుడు, నాలుగేళ్ల బాలిక ఉన్నారు. ఈ ఘటనపై తొట్టంబేడు పోలీసులు కేసు నమోదు చేశారు.
శాంతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన బోనుపల్లె దలితవాడలో విషాదం నింపింది.
.