• About Us
  • Contact Us
  • Our Team
Friday, September 11, 2026
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
No Result
View All Result

ఒంటరి పవన్‌.. అన్నయ్యల మద్దతైనా లేదెందుకు?

admin by admin
October 1, 2021
0
ఒంటరి పవన్‌.. అన్నయ్యల మద్దతైనా లేదెందుకు?

సాధారణంగా.. పవన్ కల్యాణ్ ను పల్లెత్తు మాట అన్నా సరే.. మెగాస్టార్ చిరంజీవి కొద్దిగా సంయమనం పాటిస్తారేమో గానీ.. రెండో అన్నయ్య నాగేంద్రబాబు మాత్రం.. అన్నవారిమీద వెంటనే విరుచుకుపడిపోతాడు. కానీ ప్రస్తుత సందర్భంలో పరిస్థితి భిన్నంగా ఉంది. అన్నయ్యలిద్దరూ పవన్ కల్యాణ్ కు దన్నుగా ఉండే విషయంలో మొహం చాటేశారు.

ఇండస్ట్రీ అధికారికంగా పవన్ మాటలతో మాకు సంబంధం లేదని అంటోంది. అనధికారికంగా పవన్ వ్యతిరేక వ్యాఖ్యల ద్వారా తమ మనుగడను కాపాడుకోవాలనుకుంటోంది. ఎందుకిదంతా? ఏ హేతువులు ప్రధాన భూమిక పోషిస్తున్నాయి.

పవన్ కల్యాణ్.. ప్రభుత్వం మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన ఇంతకింత తీవ్ర విమర్శలు చేసినా పరవాలేదు. సినిమా రంగానికి సంబంధించి ప్రభుత్వం తీసుకోదలచని విధాన నిర్ణయాన్ని ఇంతకింత ఘాటుగా విమర్శించినా కూడా.. అందులో ఎవ్వరూ లోపాలు వెతకరు. దాన్ని గురించి తర్కిాంచరు. ఎందుకంటే.. ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడో అతిపెద్ద రాజకీయ పార్టీకి సారధి. రేపు కాకపోతే ఎల్లుండి అయినా సరే.. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాగలనని కలలుకంటున్న వ్యక్తి.

అయితే అలాంటి విమర్శలకు, ప్రభుత్వం మీద ఆగ్రహావేశపూరిత  దాడికి ఆయన సినిమా ఫంక్షన్ ను ఎంచుకోవడం వల్లనే ఇప్పుడు ఇలాంటి చర్చ నడుస్తోంది. సాధారణంగా సినిమా ఫంక్షన్లలో భజనలు, ముఖస్తుతులు, కీర్తనలు, స్తోత్రపాఠాలు, చిడతలు తప్ప మరో రకమైన ప్రసంగం మనకు కనిపించదు.

అయితే సినిమా ఫంక్షన్ వేదిక మీదినుంచి.. వీర తిలకం దిద్దుకుని వచ్చిన పవన్ కల్యాణ్.. నిప్పులు చెరిగారు. ఆ వెంటనే ప్రభుత్వం వైపునుంచి సచివులు ఎదురు దాడికి దిగడం ఒక ఎత్తు కాగా, ఇటువైపు ఫిలిం ఛాంబర్ కూడా.. పవన్ మాటలతో సినీ పరిశ్రమకు ఏమాత్రం సంబంధం లేదని ప్రకటించడం చిత్రం. ఆ మాట చెప్పకుండా మౌనం పాటించి ఉన్నా సరిపోయేది గానీ.. పవన్ ను దూరం పెట్టినట్టు స్పష్టంగా చాటుకుంటే తప్ప మనుగడ లేదని ఛాంబర్ భావించినట్లు సాగింది.

అన్నయ్యలు ఏరీ..

చిరంజీవి ప్రతిసారీ మౌనమే, సంయమనమే, లౌక్యమే పాటిస్తూ ఉంటారు. ఆయన ఒకవైపు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ నిర్ణయాలకు సుతిమెత్తగా జైకొడుతూ.. ఆ  ప్రభుత్వాన్ని ప్రశంసించే లేఖలు రాస్తూ.. తమ వైపు నుంచి వినతులు ఏవైనా ఉన్నాసరే.. సానుకూలంగా వాటిని సాధించుకునే ప్రయత్నంలో లౌక్యనీతినే అనుసరిస్తూ ఉంటారు. పవన్ కల్యాణ్ దుందుడుకు, ఘాటైన రాజకీయ వైఖరికి చిరంజీవి తొలినుంచి దూరంగానే ఉన్నారు. సొంత అన్నయ్య మద్దతు కూడా కూడగట్టుకోలేకపోవడం మామూలుగా అయితే పవన్ వైఫల్యం కిందనే పరిగణించాలి. కాకపోతే చిరంజీవి గురించి తెలిసిన వారు దాన్ని పెద్దగా పట్టించుకోలేదు.

ఇవి కూడా చదవండి :
కేబినెట్ ప్రక్షాళన ఒక సమరం :   జగన్ vs ముగ్గురు బలమైన మంత్రులు
రోజా సీటు కింద పెద్దిరెడ్డి కుంపటి రాజేస్తున్నారా
మన విలువను వ్యక్తిత్వాన్ని మనం కాపాడుకోవడం అవసరం
అరెస్టు నుంచి రక్షణ కవచం.. సిఆర్‌పిసి 41 (ఎ)
పవన్ కల్యాణ్ పై పోసాని ఆగ్రహం న్యాయమే

టీటీడీ బోర్డు భ్రష్టు పట్టిపోయిన చరిత్ర – పార్ట్ 1
టీటీడీ బోర్డు భ్రష్టు పట్టిపోయిన చరిత్ర – పార్ట్ 2

కానీ నాగేంద్రబాబు కూడా పవన్ ను దూరం పెట్టినట్టేనా? అనేది ఇప్పుడు మీమాంస. మెగా ఫ్యామిలీలో ఎవరి మీద ఈగ వాలినా.. జోరుగా స్పందించే వ్యక్తి నాగేంద్రబాబు. ఆయన స్థాయిలో తమ కుటుంబం గురించి వచ్చే విమర్శలపై పవన్ కూడా స్పందించిన దాఖలాలు లేవు. అలాంటి నాగబాబు కూడా తాజా ఎపిసోడ్ లో పవన్ ను పట్టించుకోలేదు. పోసాని తిట్ల పర్వం తర్వాత కూడా.. నాగబాబు ఇన్‌స్టా లైవ్ లో అభిమానుల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు గానీ.. అందులో పవన్ ను సపోర్ట్ చేసే తీవ్రమైన సంగతులేమీ లేవు.

అలా అన్నయ్యల కనీస నైతిక మద్దతు కూడా లేకుండా.. పవన్ ఒంటరి అయిపోయారేమో అనిపిస్తుంది. ఇలాంటి వ్యాఖ్యలకు పవన్ వద్ద రెడీమేడ్ సమాధానాలుంటాయి. ‘‘నాకు  ఒక కుటుంబం ఏమిటి? రాష్ట్రంలో అయిదు కోట్ల మంది ప్రజలు నా కుటుంబం. వారందరి మద్దతు ప్రేమ నాకున్నాయి’’ అంటూ ఆయన హర్షధ్వానాలురేకెత్తించే, రక్తికట్టించే డైలాగులు చెప్పగలరు.

వ్యాపారం కోసమేనా?

అయితే సినిమా ఇండస్ట్రీ ఎందుకిలా పవన్ కు దూరం ఉంటోంది.. తాజాగా ఒక వేడుకలో అరవింద్ కూడా రాజు దయపెట్టాలి.. రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్టుగా ముఖ్యమంత్రి జగన్ నిర్ణయాల పట్ల సాగిలపడుతున్న, బతిమాలుతున్న ధోరణిని గమనిస్తే.. అది కేవలం అరవింద్ వైఖరి మాత్రమే కాదని, యావత్ సినీ పరిశ్రమ అసరించే వైఖరి అని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.

ఎందుకిదంతా.. అంటే తమ వ్యాపారానికి ఇబ్బంది లేకుండా మాత్రమే అని అంతా అనుకుంటున్నారు. ప్రభుత్వాన్ని ధిక్కరించి.. వ్యాపారంలో మనగలగడం కష్టం అనే ఉద్దేశంతోనే.. తాము ప్రభుత్వానికి సానుకూలంగానే ఉన్నామనే భావన వారికి కలిగించడానికి పవన్ కు దూరం ఉండడమే మార్గమని వారంతా ఫిక్సయినట్లుంది.

Tags: allu aravindchiranjeeviinsta livejaganmohan reddymovie ticketsnagababunagababu on instanagendrababupawan is alonepawan kalyanఅన్నయ్య చిరంజీవిమెగా కుటుంబం
Subscribe
Login
Notify of
guest
Optional

guest

0 Comments
Oldest
Newest Most Voted

Top Read Stories

23 ఆగస్టు 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

9.8.26 కథానిధి సమీక్ష: అక్షరాలే అసలైన కాపలాదారులు

‘యుద్ధాలు బలికోరేది మానవత్వాన్నేనా?’

9 ఆగస్టు 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

సురేష్ పిళ్లె: ఘనీభవన స్థితి ‘కడెవర్ భారతి’

చాగంటి ప్రసాద్: యతో కృష్ణ స్తతో జయః

VIDEO

https://www.youtube.com/watch?v=4IsF6u52r8o&autoplay=1&mute=1
Adarsini

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

Navigate Site

  • About Us
  • Contact Us
  • Our Team

Follow Us

No Result
View All Result
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

error: adarsini.com Content is protected !!
wpDiscuz
0
0
Would love your thoughts, please comment.x
()
x
| Reply