అఖిలాండకోెటి బ్రహ్మాండనాయకుడు తిరువేంకటగిరినాధుని బ్రహ్మోత్సవాల్లో భాగంగా.. చిన్నశేషునిపై స్వామివారు కనులపండువగా ఊరేగారు.
శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో రెండో రోజు శుక్రవారం ఉదయం 9 నుండి 10 గంటల వరకు శ్రీవారి ఆలయంలోని కల్యాణ మండపంలో శ్రీ మలయప్పస్వామివారు ఐదు తలల చిన్నశేష వాహనంపై నెమలి పింఛం, పిల్లనగ్రోవి ధరించి గీతా కృష్ణుడి అలంకారంలో దర్శనమిచ్చారు.
చిన్నశేష వాహనం – కుటుంబ శ్రేయస్సు
పురాణ ప్రాశస్త్యం ప్రకారం చిన్నశేషుడిని వాసుకి (నాగలోకానికి రాజు)గా భావిస్తారు. శ్రీ వైష్ణవ సంప్రదాయానుసారం భగవంతుడు శేషి, ప్రపంచం శేషభూతం. శేషవాహనం ఈ శేషిభావాన్ని సూచిస్తుంది. చిన్నశేష వాహనాన్ని దర్శిస్తే కుటుంబ శ్రేయస్సుతోపాటు కుండలినీయోగ సిద్ధిఫలం లభిస్తుందని ప్రశస్తి.
ప్రత్యేక ఆకర్షణ బ్రహ్మరథం, వృషభ, అశ్వ, ఏనుగుల సెట్టింగ్
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో బ్రహ్మరథం, వృషభ, అశ్వ, ఏనుగులదే అగ్రస్థానం. కానీ కోవిడ్ – 19 కారణంగా ఆలయంలోని కల్యాణమండపంలో స్వామివారి వాహనసేవలు ఏకాంతంగా జరుగుతున్న విషయం విదితమే. శ్రీవారి ఆలయంలోని కల్యాణమండపంలో నమూనా బ్రహ్మరథం, వృషభాలు, అశ్వాలు, ఏనుగుల సెట్టింగులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.
ఇవి కూడా చదవండి :
హవ్వ.. రాజగురువు చెప్పినట్టే టీటీడీ ఆడుతోందా?
ప్రజల్లో లోపమే.. ఇష్టారీతిగా ధరల పెంపుదలకు కారణమా?
కేబినెట్ ప్రక్షాళన ఒక సమరం : జగన్ vs ముగ్గురు బలమైన మంత్రులు
అరెస్టు నుంచి రక్షణ కవచం.. సిఆర్‌పిసి 41 (ఎ)
టీటీడీ బోర్డు భ్రష్టు పట్టిపోయిన చరిత్ర – పార్ట్ 1
టీటీడీ బోర్డు భ్రష్టు పట్టిపోయిన చరిత్ర – పార్ట్ 2
గ్యాంగ్ స్టర్ నయీమ్ అనుచరుడే వంద కోట్లు సంపాదించాడంటే…?
.

Discussion about this post