తిరుపతిలోని కపిలేశ్వరస్వామివారి ఆలయంలో హోమ మహోత్సవాల్లో భాగంగా శుక్రవారం కాలభైరవస్వామివారి హోమం ఏకాంతంగా జరిగింది.
ఇందులో భాగంగా యాగశాలలో ఉదయం పూజ, అష్టభైరవ హోమం, మహాపూర్ణాహుతి, కలశ ఉద్వాసన, మహాశాంతి అభిషేకం, కలశాభిషేకం, నివేదన, హారతి నిర్వహించారు.
డిసెంబరు 4న శనివారం శ్రీ చండికేశ్వరస్వామివారి హోమం జరుగనుంది.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో సుబ్రమణ్యం, సూపరింటెండెంట్ భూపతి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ రెడ్డి శేఖర్, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.
.
Discussion about this post