వీధి బాలల నిర్మూలన కోసం సమగ్ర సర్వే నిర్వహించాల్సిన అవసరం ఉందని తహసీల్దార్ జరీనా బేగం అన్నారు.
శ్రీకాళహస్తి మండల పరిషత్ సమావేశ హాలులో శుక్రవారం ఎంఈవో భువనేశ్వరి అధ్యక్షతన వీధి బాలల సర్వేపై ముందస్తు కార్యాచరణపై వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాలల హక్కులను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. పట్టణంలో సోమవారం నిర్వహించనున్న సర్వేకి అన్ని శాఖల అధికారులు, సిబ్బంది సహకారం అందించాలని కోరారు.
కార్యక్రమంలో ఎంఈవో భువనేశ్వరి, ఈవోపీఆర్డీ శారద, సీడీపీవో శాంతిదుర్గ, ఎస్ ఐ వెంకటసుబ్బయ్య, ప్రగతి స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి ప్రభాకర్, సమగ్ర శిక్ష సిబ్బంది పాల్గొన్నారు.
.