శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ప్రధాన అర్చకులు, వేద పండితులకు పోలీసుల నుంచి పొరుగ సేవల సిబ్బంది నుంచి తిప్పలు ఎదురవుతున్నాయి.
శుక్రవారం సాయంత్రం కాణిపాక దేవస్థానం నుంచి పట్టువస్త్రాలు తీసుకు వచ్చిన సమయంలో ఆలయ అర్చకులు దక్షిణామూర్తి విధులకు రాగా ధ్వజస్తంభం వద్ద అక్కడ విధులు నిర్వహిస్తున్న పొరుగు సేవల సిబ్బంది అనిల్ తాళాలు వేసి అడ్డుకున్నారు.
మహా శివరాత్రి పర్వదినాన అభిషేకం గురుకుల్, వేద పండితులను పోలీసులు అనుమతించకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఆలయంలో విధివిధానాలు లేకుండా పోవడంతో విధులకు వస్తున్న అర్చకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
శుక్రవారం సాయంత్రం అదే గేటు వద్ద అర్చకునికి తాళాలు తీయని అవుట్ సోర్సింగ్ ఉద్యోగి.. కొంత సమయం తర్వాత ఓ సిఫార్సు కలిగిన ఉద్యోగి ఎంచక్కా బీగాలు తీసుకొని ఓ బృందాన్ని తీసుకుని వెళ్లడం అక్కడున్న వారిని ముక్కున వేలేసుకునేలా చేసింది.
అర్చకుని ఆపివేసిన అవుట్ సోర్సింగ్ ఉద్యోగి సిఫార్సు గలిగిన కాంట్రాక్టు ఉద్యోగిని ఆపక పోవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అర్చకులకు విధించే నిబంధన సిఫార్సు కలిగినవారికి వర్తించవా? వారిని మాత్రం ఎందుకు పంపారో? చర్చనీయాంశంగా మారింది.
ఇప్పటికైనా దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులు, ఆలయ అధికారులు స్పందించి ఆలయంలో పెత్తనం చేస్తున్న పొరుగు సేవల సిబ్బందిని నియంత్రించక పోతే దేవస్థానం అభాసుపాలు కాక తప్పదని పలువురు అంటున్నారు.
.