అంబేడ్కర్ ముని మనుమడు డాక్టర్ రాజారత్నం అశోక్ అంబేడ్కర్ ర్యాలీని జయప్రదం చేసిన బహుజనులందరికీ జై భీమ్ ఆర్మీ వ్యవస్థాపకులు పులి శ్రీకాంత్ ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ మేరకు ఆయన బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. తన ఆహ్వానాన్ని మన్నించి చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి పట్టణానికి విచ్చేసిన డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ మునిమనవడు డాక్టర్ రాజారత్నం అశోక్ అంబేడ్కర్ రాకతో బహుజనులలో మార్పు వచ్చి… అందరూ ఏకమై ఒక తాటి మీద నడవడం చాలా సంతోషకరంగా ఉందన్నారు.
మన దేశానికి స్వాతంత్రం వచ్చి 72 సంవత్సరాలు అయినప్పటికీ మొట్టమొదటిసారిగా అంబేద్కర్ వారసులు శ్రీకాళహస్తి పట్టణానికి విచ్చేయడం చాలా సంతోషకరం గా ఉందన్నారు.
అంబేడ్కర్ రాక బహుజన లో కొత్త మార్పు వచ్చి రాజ్యాధికారం వైపు అడుగులు వేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయం చేసిన బహుజనులందరికీ… ప్రత్యేకంగా ముఖ్య పాత్ర వహించిన జై భీమ్ ఆర్మీ నాయకులు కన్నలి రమేష్, కాగితాల మధు, షేక్ బషీర్, దారా పాండు, పి కస్తూరయ్య , పసల కుమార్, శంకర్ కు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
.