బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం నిన్న ప్రవేశ పెట్టిన బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీవ్రమైన ద్రోహం చేసిందని దానికి నిరసనగా సిపిఎం ,సిపిఐ ,అంబేద్కర్ ఆర్మీ, ఏపీ యానాది సంఘం ఆధ్వర్యంలో శ్రీకాళహస్తిలోని అంబేద్కర్ కూడలి వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు.
ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు హంగేరి పుల్లయ్య సిపిఐ కార్యదర్శి గురవయ్య దళిత నాయకులు పులి శ్రీకాంత్ గిరిజన సంఘం నాయకులు కోటయ్య సంయుక్తంగా మాట్లాడుతూ విభజన సమయంలో ఆంధ్ర ప్రదేశ్ కు ఇచ్చినటువంటి హామీలు ఒక్కటి కూడా డా బడ్జెట్లో చేర్చకపోవడం తీవ్రమైన అన్యాయంగా పేర్కొన్నారు.
ఈ బడ్జెట్లో కార్పొరేట్లకు ఇచ్చి సామాన్య మధ్య తరగతి ప్రజలను విస్మరించారని వాపోయారు. ఉపాధి హామీ విద్య వైద్యం తదితర రంగాలకు బడ్జెట్లో వాస్తవ ఖర్చు కన్నా తగ్గింపులు చేశారని దీనితో సామాన్య ప్రజలకు ఏ మాత్రం లాభం చేకూరదని తెలిపారు. అధిక ధరలతో అల్లాడుతున్న ప్రజలకు ధరల తగ్గింపు విషయంలో హామీ లేదన్నారు.
రైతులకు మద్దతు ధర ఎరువుల ధరల తగ్గింపు విషయంలో బడ్జెట్లో స్థానమే కనిపించడం లేదన్నారు. నిరుద్యోగులకు ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి దాని గురించి ఉద్యోగ కల్పన చేపడతామని హామీ లేదన్నారు. పోలవరం ప్రాజెక్ట్ కి నిధుల గురించి గానీ పునరావాసం గురించి గానీ బడ్జెట్లో చర్చే లేకుండా చేశారన్నారు. ప్రైవేటు సంస్థలకు ప్రభుత్వ రంగ సంస్థలను అప్పజెప్పడం ఒకటే ఈ బడ్జెట్ లో బీజేపీ ప్రభుత్వం చేసిందని తెలిపారు.
పన్నుల రూపంలో రాష్ట్రానికి రావాల్సిన వాటా నిధులు పోవడం.. ఈ బడ్జెట్లో కూడా జరిగిందన్నారు. ఈ విధంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం పై కక్షపూరిత వ్యవహారం సరికాదన్నారు. ఇప్పటికైనా ఏపీ ముఖ్యమంత్రి దీనిపై నోరు తెరిచి మాట్లాడాలని రాష్ట్రానికి రావాల్సిన కేంద్ర ప్రాజెక్టులు నిధులు బడ్జెట్ కేటాయింపులు కేంద్రంతో చర్చించి సాధించాలని డిమాండ్ చేశారు.
లేకపోతే నిధుల సంక్షోభంలో ఉన్న రాష్ట్రం తీవ్ర సంక్షోభంలోకి వెళ్లే పరిస్థితి వస్తుందని సూచించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి గంధం మనీ గురవయ్య ఈశ్వరయ్య దళిత సంఘం నాయకులు పాండు తదితరులు పాల్గొన్నారు.
.