భారతీయ జనతా పార్టీ తిరుపతి పార్లమెంటరీ జిల్లా ఉపాధ్యక్షులు డాక్టర్ చంద్రప్పను గురువారం ఆ పార్టీ నేతలు సన్మానించారు. చంద్రప్ప సుమారు 30 ఏళ్లుగా చేస్తున్న సేవలను గుర్తించి కెనడాకు చెందిన ప్రఖ్యాత బ్రాంప్టన్ ఇంటర్నేషనల్ యూనివర్శిటీ ఇటీవల గౌరవ డాక్టరేట్ ను ప్రదానం చేసింది.
ఈ నేపథ్యంలో బీజేపీ నేతలు ఆయనకు సన్మానం చేశారు. ఈ సందర్భంగా చంద్రప్ప సేవలను వారు కొనియాడారు. చంద్రప్పను ఆదర్శంగా తీసుకుని సేవలు చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా మోర్చా ఉపాధ్యక్షులు ఉమా సింగ్, మహిళా మోర్చా మాజీ రాష్ట్ర అధ్యక్షురాలు రత్నమ్మ, వరదయ్యపాలెం మండలానికి చెందిన బీజేపీ నాయకులు కొల్ల గిరిధర్ రెడ్డి, ఆరోగ్య రక్ష సమితి మండల కో- ఆర్గనైజర్ పసుపులేటి ఆనంద్, అంబేద్కర్ యువజన సంఘం నాయకులు శంకర్, రాము తదితరులు పాల్గొన్నారు.
కాగా కరోనా సమయంలో స్వచ్చందంగా అనేక రకాల ఆహార, ఆర్థిక, వైద్య సేవలనందించి సమాజం పట్ల తన ఉదారతను చాటుకున్న ఆరోగ్యరక్ష సమితి వరదయ్యపాలెం మండల కో- ఆర్గనైజర్ పసుపులేటి ఆనంద్ ను డా. చంద్రప్ప శాలువా కప్పి సత్కరించి అభినందించారు.
.