జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పరిరక్షించుకోవడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చిన్నం చెంచలయ్య పిలుపు నిచ్చారు.
ఈ మేరకు ఆయన ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ప్రమాదం లో పడిందన్నారు.
ఉపాధి హామీ చట్టం ను రక్షించు కోవడానికి మంగళవారం ఛలో విజయవాడకు పిలుపునిచ్చినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి గ్రామీణ ప్రాంత పేదలు పెద్ద ఎత్తున విజయవాడ కు తరలి రావాలని ఆయన కోరారు.
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కూలీలకు అవసరమైన బడ్జెట్ కేటాయించకుండా బీజేపీ ప్రభుత్వం తీరని ద్రోహం చేసిందని విమర్శించారు. చట్టం లో రెండు పూటలా పని చేయించే ఆలోచన మానుకోవాలని.. పని ప్రదేశం లో తప్పని సరిగా టెంట్లు , మజ్జిగ ప్యాకెట్ , మెడికల్ కిట్ తదితర సౌకర్యాలు అందించాలని కోరారు.
ఉపాధి హామీ పథకం అమలు కోసం 2.40 లక్షల కోట్లు నిధులు కేటాయించాలని డిమాండు చేశారు . వ్యవసాయ రంగంలో ఉపాధి హామీ పనులు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ లో పెట్టడం సమంజసం కాదన్నారు . ఉపాధి కూలీలు తమంతట తాము పనులకు రాకుండా నిలిచిపోయేలా చేసి ఆ చట్టాన్ని నిర్వీర్యం చేయడానికి బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని ఆయన మండి పడ్డారు .
ఈ తరుణం లో ఉపాధి హామీ పథకం ను రక్షించుకొనుటకు గ్రామీణ ఉపాధి హామీ కూలీలు పెద్ద సంఖ్యలో తరలి రావాలని కోరారు.
.