ఇంటింటికి రాజ్యాంగ ఫలాలు అందించడమే జై భీమ్ దేశ్ ముఖ్య ఉద్దేశ్యమని జై భీమ్ దేశ్ వ్యవస్థాపకులు దాసరి చెన్నకేశవులు తెలిపారు.
శ్రీకాళహస్తి పట్టణంలోని అంబేద్కర్ భవన్ లో ఆదివారం ‘గడపగడపకు అంబేద్కరిజం… ఇంటింటికి భారత రాజ్యాంగం’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు .
ఈ సందర్భంగా చెన్నకేశవులు మాట్లాడుతూ పేద ప్రజలకు రాజ్యాంగ ఫలాలు అందించడమే లక్ష్యంగా జై భీమ్ దేశ్ పని చేస్తోందన్నారు. అంబేద్కర్ త్యాగ ఫలితంగా రూపొందిన రాజ్యాంగం ద్వారా దళిత బడుగు బలహీన వర్గాలు అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.
రాజ్యాంగ బద్ధంగా పరిపాలన సాగించాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 75 సంవత్సరాలుగా రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి సామాన్యమైన మానవునికి రాజ్యంగ ఫలాలు అందకుండా పాలన సాగిస్తున్నాయని విమర్శించారు. ఉచితాలతో పేదలను ప్రలోభపెట్టి వారిని బానిసలుగా మార్చి చేస్తోందని విమర్శించారు .
పేద ప్రజలను కేవలం ఓటు బ్యాంకు గానే రాజకీయ నాయకులు చూస్తున్నారని దుయ్యబట్టారు . ఓటు బ్యాంకుగా చూస్తున్న రాజకీయ ప్రతిపక్ష పార్టీలను ఎండగట్టి పేద ప్రజలకు రాజ్యంగ ఫలాలు అందేలా చేయడానికి జై భీమ్ దేశ్ ప్రయత్నిస్తోందన్నారు.
ఉచిత విద్యను అందించాల్సిన ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు వ్యాపారంగా మార్చిందని విమర్శించారు. ఇది రాజ్యాంగ ఉల్లంఘన కాదా అని ప్రశ్నించారు . అలాగే వైద్యం కూడా నేడు ఒక వ్యాపారంగా మారిందన్నారు. పేదలకు ఉచిత విద్య వైద్యం కావాలంటే రాజ్యాంగబద్ధంగా పరిపాలన చేసే వాళ్ళకి ఓటు వేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో జై భీమ్ దేశ రాష్ట్ర అధ్యక్షుడు గది నరసింహారావు , చిత్తూరు జిల్లా అధ్యక్షుడు నెలవల ప్రసాద్, జాతీయ కార్యదర్శి కె. మోహన్, దళిత నాయకులు పసల రామచంద్రయ్య, పసల కమలాకర్, బూరు రామమూర్తి తదితరులు పాల్గొన్నారు.
.