శ్రీకాళహస్తి మండలం బీవీపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం 12-14 ఏళ్ల మధ్య వయసు గల విద్యార్థులకు కొవిడ్ టీకా వేశారు.
ఈ పాఠశాలలో మొత్తం 24 మంది విద్యార్థులు ఈ టీకా వేయించుకున్నారు. శ్రీకాళహస్తి మండల విద్యాశాఖాధికారిణి భువనేశ్వరి టీకా కార్యక్రమ ఏర్పాట్లను పర్యవేక్షించారు.
ఈ సందర్భంగా భువనేశ్వరి మాట్లాడుతూ… పాఠశాలల్లో విద్యార్థులు కొవిడ్ బారిన పడకుండా ఉండటానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందు జాగ్రత్తగా టీకా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
12 ఏళ్లు పైబడిన విద్యార్థులు ప్రతి ఒక్కరూ ఈ అవకాశవ వినియోగించుకోవాలని కోరారు. అనంతరం ఇదే పాఠశాలలో ఆమె మధ్యాహ్న భోజనం తనిఖీ చేశారు.
ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు పీవీ రమేష్, డాక్టర్ అనిల్, ఏఎన్ ఎం భారతి, సీ ఆర్ పీ ప్రసాద్, కేవీ ప్రశాంత్, తదితరులు పాల్గొన్నారు.
.