భారత కమ్యూనిస్టు పార్టీ పేదల పక్షపాతి అని ఆ పార్టీ శ్రీకాళహస్తి ఏరియా కార్యదర్శి జనమాల గురవయ్య అన్నారు. శ్రీకాళహస్తి నియోజకవర్గం లో భారత కమ్యూనిస్టు పార్టీ 97వ వ్యవస్థాపక దినోత్సవం ఆదివారం ఘనంగా నిర్వహించారు.
పార్టీ జెండా ఆవిష్కరించి వందనం చేశారు. ఈ సందర్భంగా జనమాల గురవయ్య మాట్లాడుతూ సీపీఐ పేదల కోసం ఆవిర్భవించిందన్నారు. పేదల పక్షాన నిలబడి… వారి సమస్యల పరిష్కారానికి రాజీలేని పోరాటం చేస్తోందన్నారు.
తమ పార్టీ నేతలు లాఠీలకు, తూటాలకు సైతం భయపడలేదన్నారు. అనేక నిర్బంధాలను సైతం అధిగమించి… పేదలకు న్యాయం చేసిన చరిత్ర భారత కమ్యూనిస్టు పార్టీకి ఉందని ఈ సందర్భంగా ఆయన వివరించారు. నేటికీ అదే బాటలో తాము నడుస్తున్నామన్నారు.
శ్రీకాళహస్తి నియోజకవర్గంలో సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో అనేక భూ పోరాటాలు చేసి… పేద, బడుగు, బలహీన వర్గాలకు ఇళ్ల స్థలాలను, సాగు భూములు ఇప్పించడంలో ముందుందన్నారు. ప్రజలకు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా మొట్టమొదటగా నిలబడేది సీపీఐ పార్టీయేనని ఈ సందర్భంగా గురవయ్య చెప్పారు.
పార్టీవ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని నియోజకవర్గంలో అన్ని శాఖలలో జెండాలను ఆవిష్కరించడం జరిగిందన్నారు.
తొట్టబేడుమండలంలో శ్రీనివాసులు, పార్టీ కార్యాలయంలో సురేష్, ముళ్ళపూడి గిరిజన కాలనీలో జనమాల గురవయ్య, మండల కార్యదర్శి శివకుమార్ మండల నాయకులు గోపి, భగత్ సింగ్ కాలనీలో రాజయ్య ,22 వ వార్డులో నవీన్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ చేసినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు,విద్యార్థి, యువజన, వ్యవసాయ, కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నట్లు గురవయ్య తెలిపారు.
.