శ్రీకాళహస్తి మండలం అక్కుర్తి గ్రామ ఎస్టీలపై దాడి చేసిన వారిని అరెస్టు చేసి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలంటూ సిపిఎం సిపిఐ kvps ఎరుకుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ కూడలి వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా నాయకులందరూ ముక్తకంఠంతో మాట్లాడుతూ అక్కుర్తి ఎస్ టి కాలనీలో గత 50 సంవత్సరాలుగా గంగమ్మ దేవతగా స్థానిక వేప చెట్టును భావించి పూజలు నిర్వహించి అక్కడే జాతరకి పొంగల్ లు పెట్టడం అంబళ్ళు పోయడం వ్యక్తిగత పూజా కార్యక్రమాలు అన్నీ చేసేవారన్నారు.
స్థానిక గ్రామానికి చెందిన అగ్రవర్ణాల వారు ఆ భూమిపై కన్నేసి దానిని కబ్జా చేయడం జరిగింది. అంతటితో ఆగకుండా ఆ నీళ్లు అనాదిగా పూజలు చేస్తున్నటువంటి వేప చెట్టును జెసిబి తో వేళ్ళ తో సహా ప్రకటించడం జరిగింది. ఈ విషయంపై పోలీసులకు అధికారులకి తెలియజేసినా ఎవరు ఎస్టీలకు న్యాయం చేయలేదు.
ఈరోజు అమావాస్య సందర్భంగా ఎస్టీలు గ్రామ దేవత గంగమ్మ దగ్గర ఒంగోలు పెట్టుకోడానికి వెళ్లడంతో విషయం తెలుసుకున్న అగ్రవర్ణాల వారు కర్రలతో మూకుమ్మడిగా దాడి చేసి వారి యొక్క ఆచార వ్యవహారాలు కాళ్లతో తన్ని చెరిపివేసి కర్రలతో మహిళ పైన అడ్డం వచ్చిన వారి పైన దాడి చేసి కులం పేరుతో దూషించి అవమానపరిచారని ఆరోపించారు.
ఇదంతా పోలీసుల సమక్షంలో కూడా జరిగిందని ఇది ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటని అన్నారు. ఎస్ టీ ల పై దాడి చేసినటువంటి బాధ్యులను తక్షణమే అరెస్టు చేసి వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి ఎస్సీలకు న్యాయం చేయాలని చెప్పి నాయకులు కోరారు.
లేనిపక్షంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో లో లో సిపిఎం నాయకులు అంజలి పుల్లయ్య గంధం మనీ గురవయ్య ఈశ్వరయ్య సీపీఐ నుంచి జన మాల గురవయ్య కెవిపిఎస్ నుంచి ఈశ్వరయ్య వేణు వెళ్లి వేంద్రం ఎరుకుల సంక్షేమం సంఘము నుంచి సుబ్రహ్మణ్యం శంకరయ్య గ్రామ ఎస్టీలు పాల్గొన్నారు.
.